Video: ప్లీజ్, అతని బ్యాంక్ అకౌంట్ చెక్ చేయండి.. చెత్త ఫీల్డింగ్‌పై నెటిజన్ల రిక్వెస్ట్

ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న ఉత్కంఠభరిత పోరులో ఒక సాధారణ క్యాచ్‌ను వదిలేసిన పంజాబ్ ఆల్ రౌండర్ శశాంక్ సింగ్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల పాలవుతున్నారు. కీలక సమయంలో కేఎల్ రాహుల్ వంటి ప్రమాదకర ఆటగాడికి జీవనదానం ఇవ్వడం పంజాబ్ జట్టుపై భారీ ప్రభావం చూపుతోంది. ఈ వైఫల్యంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Video: ప్లీజ్, అతని బ్యాంక్ అకౌంట్ చెక్ చేయండి.. చెత్త ఫీల్డింగ్‌పై నెటిజన్ల రిక్వెస్ట్
Shashank Singh Heavily Ridiculed For Kl Rahul Dropped Catch

Updated on: Apr 25, 2026 | 4:49 PM

Shashank Singh Heavily Ridiculed For KL Rahul Dropped Catch: అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ వేసిన షార్ట్ డెలివరీని కేఎల్ రాహుల్ పుల్ షాట్ ఆడాడు. డీప్ స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శశాంక్ సింగ్ వైపు ఆ బంతి నేరుగా వెళ్ళింది. అత్యంత సులభమైన ఆ క్యాచ్‌ను పట్టుకోవడంలో శశాంక్ విఫలమయ్యాడు. క్యాచ్ వదలడమే కాకుండా ఆ బంతి కాస్తా బౌండరీకి వెళ్లడంతో పంజాబ్ జట్టుకు డబుల్ షాక్ తగిలింది. ఈ తప్పు చూసిన అర్ష్‌దీప్ తీవ్ర నిరాశకు గురవ్వగా, స్టాండ్స్‌లో ఉన్న యజమాని ప్రీతి జింటా ముఖం కూడా వాడిపోయింది.

ఫిక్సింగ్ ఆరోపణలు – సోషల్ మీడియాలో ట్రోల్స్..

శశాంక్ సింగ్ వరుసగా క్యాచ్‌లు వదులుతుండటంతో అభిమానుల సహనం నశించింది. కొందరు నెటిజన్లు ఏకంగా “అతని బ్యాంక్ ఖాతాను తనిఖీ చేయండి” అంటూ ఫిక్సింగ్ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రొఫెషనల్ ఆటగాడు ఇంత సులభమైన అవకాశాలను ఎలా జారవిడుస్తాడని ప్రశ్నిస్తున్నారు. గతంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో కూడా శశాంక్ ఏకంగా మూడు క్యాచ్‌లు వదిలేయడం గమనార్హం. వరుస ఫీల్డింగ్ తప్పిదాలు జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

6,6,6,4,4,4,4,4,4.. 16 నిమిషాల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. ప్రపంచ రికార్డ్‌కే పిచ్చెక్కించిన ఆల్ రౌండర్.!

రిక్కీ పాంటింగ్ ఆగ్రహం.. శ్రేయాస్ అయ్యర్ సెటైర్లు..

ఫీల్డింగ్ లో శశాంక్ నిర్లక్ష్యం పట్ల కోచ్ రిక్కీ పాంటింగ్ డగౌట్ లో తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాత్రం దీనిపై కాస్త సరదాగా స్పందించాడు. శశాంక్ సింగ్‌ను ఉద్దేశించి “నీ ముఖం ఎక్కడైనా దాచుకో” అంటూ జోక్ చేశాడు. జట్టు విజయం సాధించిన సందర్భాల్లో ఇలాంటి తప్పులు సరదాగా అనిపించినా, క్లిష్టమైన మ్యాచుల్లో ఇవి మూల్యం చెల్లించుకునేలా చేస్తాయని క్రీడా పండితులు హెచ్చరిస్తున్నారు.

Team India: ‘టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ నో ఎంట్రీ.. ఆ ఒక్క రీజన్‌తో గంభీర్ మొండిచేయి’

చెలరేగిపోతున్న కేఎల్ రాహుల్..


తొలి వికెట్ త్వరగానే పడినా, శశాంక్ ఇచ్చిన అవకాశాన్ని కేఎల్ రాహుల్ అద్భుతంగా వాడుకున్నాడు. జీవనదానం లభించిన తర్వాత రాహుల్ 200 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. వార్త రాసే సమయానికి ఢిల్లీ టీం ఒక వికెట్ కోల్పోయి 12 ఓవర్లలో 142 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 65, నితీష్ రాణా 65 పరుగులతో నిలిచారు. ఒక్క క్యాచ్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుందని ఈ ఇన్నింగ్స్ చూస్తే అర్థమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us