IPL 2025: శ్రేయాస్ నా చెంప మీద కొడితే బాగుండేది.. శశాంక్ సింగ్ క్లారిటీతో ఫిదా అవ్వాల్సిందే..

Shashank Singh's Honest Confession: ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత పంజాబ్ కింగ్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కోల్పోయింది. ఇప్పుడు, క్వాలిఫైయర్ 2లో రనౌట్ అయిన శశాంక్ సింగ్ తన తప్పును అంగీకరించాడు. ఆ సమయంలో కెప్టెన్ శ్రేయాస్ చేసింది సరైనదేనని అతను చెప్పుకొచ్చాడు.

IPL 2025: శ్రేయాస్ నా చెంప మీద కొడితే బాగుండేది.. శశాంక్ సింగ్ క్లారిటీతో ఫిదా అవ్వాల్సిందే..
Shashank Singh Vs Shreyas Iyer

Updated on: Jun 08, 2025 | 9:09 PM

Shashank Singh vs Shreays Iyer: ఐపీఎల్ 2025 (IPL 2025) ఫైనల్లో పంజాబ్ కింగ్స్ (PBKS) చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs PBKS) ఓడిపోయింది. దీంతో ఆ జట్టు తొలి ట్రోఫీని ఎత్తేయాలనే కల చెదిరిపోయింది. బ్యాటర్ల వైఫల్యమే జట్టు ఓటమికి ప్రధాన కారణమైనప్పటికీ, ఆ జట్టు అన్‌క్యాప్డ్ ప్లేయర్ శశాంక్ సింగ్ విజయం కోసం ఒంటరిగా పోరాడి మ్యాచ్‌ను చివరి వరకు ఉత్కంఠభరితంగా మార్చాడు. అయితే, IPL ఫైనల్ తర్వాత మాట్లాడిన పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ శశాంక్ సింగ్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు.

తన తప్పును ఒప్పుకున్న శశాంక్..

IPL 2025 క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టును ఓడించడంలో పంజాబ్ విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయాస్ ఆడిన ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌లో పంజాబ్ విజయానికి ప్రధాన కారణం. ఒకవైపు వికెట్లు పడిపోతుండగా, మరోవైపు శ్రేయాస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అందుకే పంజాబ్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో, గేమ్ ఫినిషర్‌గా పేరుగాంచిన శశాంక్ సింగ్‌పై చాలా అంచనాలు ఉన్నాయి.

శశాంక్ పట్ల బహిరంగంగా అసంతృప్తి..

ఎందుకంటే, అయ్యర్ తప్ప జట్టులోని కీలక ఆటగాళ్లందరూ పెవిలియన్ చేరారు. ఈ దశలో, అయ్యర్ ఇన్నింగ్స్ పూర్తి చేయడానికి ఒక ఆటగాడు అవసరం. దీనికి అనుబంధంగా శశాంక్ బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ, శశాంక్ బాధ్యతారహితంగా ఆడటం వల్ల రనౌట్ అయ్యాడు. మ్యాచ్ తర్వాత, కెప్టెన్ శ్రేయాస్ బహిరంగంగా శశాంక్ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

దీని గురించి ఒక ఇంటర్వ్యూలో శశాంక్ సింగ్ మాట్లాడుతూ, శ్రేయాస్ సరైన పని చేశాడు. నేను దానికి అర్హుడిని. అయ్యర్ నన్ను చెంపదెబ్బ కొట్టి ఉంటే బాగుండేది. ఫైనల్ వరకు నాన్న కూడా నాతో మాట్లాడలేదు. నేను రనౌట్ అయిన సమయం జట్టుకు చాలా ముఖ్యమైనది. కానీ, నేను తప్పు చేశాను. మ్యాచ్ తర్వాత, శ్రేయాస్ నా నుంచి అలాంటి తప్పును ఊహించలేదని స్పష్టంగా చెప్పాడు. తరువాత, అతను నన్ను భోజనానికి తీసుకెళ్లాడు.

ఫైనల్‌లో శశాంక్ ప్రదర్శన..

ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2లో శశాంక్ సింగ్ పెద్ద స్కోరు సాధించలేకపోయినప్పటికీ, IPL 2025 ఫైనల్‌లో అతను అజేయంగా 61 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ అభిమానుల ప్రశంసలను అందుకుంది. అయితే, శశాంక్ తన జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. IPL 2025లో ఆడిన 17 మ్యాచ్‌ల్లో శశాంక్ సింగ్ 50 సగటుతో 350 పరుగులు చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు అజేయంగా 61 పరుగులు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..