NZ Vs WI: టీమిండియాపై తోపు రికార్డు.. కట్ చేస్తే.. 13 ఫోర్లు, 4 సిక్సర్లతో ధోని శిష్యుడి దండోరా.! ఎవరంటే.?

న్యూజిలాండ్‌తో జరిగిన నేపియర్ వన్డేలో షాయ్ హోప్ సెంచరీ సాధించాడు. అతను 66 బంతుల్లో సెంచరీ చేయగా.. ఇది అతనికి 19వ వన్డే సెంచరీ. అలాగే ఈ సెంచరీతో హోప్ అరుదైన ఘటన సాధించాడు. తన బ్యాటింగ్ లో మార్పులు కూడా ధోనితో సాధ్యమైంది అని చెప్పాడు..

NZ Vs WI: టీమిండియాపై తోపు రికార్డు.. కట్ చేస్తే.. 13 ఫోర్లు, 4 సిక్సర్లతో ధోని శిష్యుడి దండోరా.! ఎవరంటే.?
Shai Hope

Updated on: Nov 19, 2025 | 7:39 PM

న్యూజిలాండ్‌పై షాయ్ హోప్ అద్భుతమైన సెంచరీ చేశాడు. ధోని మాదిరిగా సిక్స్ కొట్టి సెంచరీ పూర్తీ చేశాడు. హోప్ 66 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. హోప్ తన సెంచరీని వెస్టిండీస్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాధించాడు. ఇది అతడి వన్డే కెరీర్‌లో 19వ సెంచరీ కాగా.. షాయ్ హోప్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ కారణంగా వెస్టిండీస్ జట్టు 34 ఓవర్లలో 247 పరుగులు చేయగలిగింది.

న్యూజిలాండ్‌పై తొలిసారిగా షాయ్ హోప్ సెంచరీ..

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు పేలవమైన ఆరంభాన్ని సాధించింది. 40 పరుగులలోపు రెండు వికెట్లు కోల్పోయారు. 86 పరుగులు చేరుకునే సమయానికి సగం జట్టు పెవిలియన్ చేరారు. అయితేనేం షాయ్ హోప్ ఒక ఎండ్‌లో పాటుకుపోయాడు. ఈ క్రమంలోనే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటమే కాకుండా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ఆ జట్టుపై తన తొలి ODI సెంచరీని కూడా నమోదు చేశాడు.

వన్డేల్లో 6000 పరుగులు..

షాయ్ హోప్ 69 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 109 పరుగులు చేశాడు. అతను 66 బంతుల్లో తన సెంచరీని చేరుకున్నాడు. ఈ సెంచరీతో హోప్ వన్డే క్రికెట్‌లో 6000 పరుగులు పూర్తి చేశాడు. అలాగే ఈ ఘటన 142 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. వెస్టిండీస్ తరపున వన్డే క్రికెట్‌లో 6000 పరుగులు సాధించిన రెండవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్ షాయ్ హోప్.

ధోని సలహా ఆటలో మార్పు..

షాయ్ హోప్ తన ఆటలో మార్పు కోసం ధోని నుంచి కొన్ని సలహాలు అడిగాడు. ధోని ఇచ్చిన టెక్నిక్స్‌తో తన ఆటను పూర్తిగా మార్చుకున్న హోప్.. వరుసగా సెంచరీలతో అదరగొట్టాడు. అలాగే టీమిండియాపై కూడా హోప్‌రఉ మంచి ట్రాక్ రికార్డు ఉందన్నది తెలిసిందే.