Jasprit Bumrah : పేరుకు పగోడే అయినా బూమ్రా గురించి ఉన్నది ఉన్నట్లు చెప్పాడు.. అది కదా మన ప్లేయర్లంటే

షాహీన్ షా అఫ్రిది వంటి అగ్రశ్రేణి పేసర్ నుంచి జస్ప్రీత్ బుమ్రాకు ప్రశంసలు రావడం అతని గొప్పతనాన్ని చాటుతుంది. మూడు ఫార్మాట్‌లలో బుమ్రా నిలకడైన ప్రదర్శన, వికెట్లు తీయగల అతని కెపాసిటీ అతన్ని నిజంగానే ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా నిలబెడుతుంది. లార్డ్స్ టెస్ట్‌లో అతని ప్రదర్శనపై భారీ అంచనాలు ఉన్నాయి.

Jasprit Bumrah : పేరుకు పగోడే అయినా బూమ్రా గురించి ఉన్నది ఉన్నట్లు చెప్పాడు.. అది కదా మన ప్లేయర్లంటే
Jasprit Bumrah

Updated on: Jul 10, 2025 | 4:03 PM

Jasprit Bumrah : పాకిస్థాన్ స్టార్ పేస్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది భారత స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రాను ఆకాశానికెత్తేశాడు. భారత పేసర్‌ను కంప్లీట్ బౌలర్ అని అభివర్ణిస్తూ, ప్రపంచంలోనే ఉత్తమ బౌలర్‌గా ప్రకటించాడు. పాకిస్థాన్ పేసర్ అఫ్రిదికి సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అందులో అతను బుమ్రాకు 10కి 10 మార్కులు ఇస్తూ కనిపించాడు. పాకిస్థాన్ టీ20 కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన అఫ్రిదిని, బుమ్రాకు 10కి ఎన్ని మార్కులు ఇస్తారని అడగగా, 10 మార్కులు అని సమాధానం చెప్పాడు. కారణం అడిగినప్పుడు అఫ్రిది మాట్లాడుతూ.. నిజానికి తను ప్రస్తుత కాలంలో బెస్ట్ బౌలర్. నా అభిప్రాయం ప్రకారం, అతను ప్రస్తుత ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని చెప్పాడు.

31 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా టెస్ట్, వన్డే, టీ20… ఇలా క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలోనూ తనదైన ముద్ర వేశాడు. అతని గణాంకాలు చూస్తేనే అతను ఎంత గొప్ప బౌలరో అర్థమవుతుంది. ఇప్పటివరకు 46 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన బుమ్రా, ఏకంగా 210 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అతను 14 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. వన్డేల విషయానికి వస్తే, 89 మ్యాచ్‌లలో 149 వికెట్లు తీశాడు. ఇక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 70 మ్యాచ్‌లు ఆడి 89 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

తాజా సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు. అయితే, లీడ్స్ టెస్ట్‌లో భారత్ ఓడిపోయింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో అతను ఆడలేదు. లార్డ్స్ టెస్ట్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఆడుతున్నాడు. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాపై అన్ని 5 టెస్ట్ మ్యాచ్‌లలో ఆడి, 32 వికెట్లు పడగొట్టాడు. 2024లో అతను అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీశాడు. గతేడాది ఐసీసీ అతనికి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ , టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను అందించింది.

బుమ్రా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో లోయర్ బ్యాక్ ఇంజ్యూరీ కారణంగా ఆడలేకపోయాడు. ఈ కారణంగా అతను ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌లలో కూడా ముంబై ఇండియన్స్ తరపున ఆడలేకపోయాడు.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..