ICC World Test Championship 2023: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు జరగనుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం ఈ చారిత్రాత్మక పోరుకు సాక్ష్యం కానుంది. ఈ ముఖ్యమైన టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇప్పటికే టీమ్ ఇండియాను ప్రకటించింది. అలాగే ఆస్ట్రేలియా కూడా తన స్వ్కాడ్‌ను ప్రకటించింది. ఈక్రమంలో ఇరుజట్ల ప్లేయింగ్ 11పై మాజీలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తన టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11ని ప్రకటించారు.
ఇక తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, వెటరన్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ రికీ పాంటింగ్ కూడా ఆసీస్ టీంను ప్రకటించాడు. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టులో మైఖేల్ నేజర్‌ను చేర్చడాన్ని ఆయన సమర్థించాడు. అయితే అతను భారత్‌తో నిర్ణయాత్మకంగా మరొక ఫాస్ట్ బౌలర్ కోసం చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ బౌలర్ పేరు స్కాట్ బోలాండ్.
భారత్‌తో జూన్ 7న ఓవల్‌లో ప్రారంభం కానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చివరి మ్యాచ్‌కు జోష్ హేజిల్‌వుడ్ ఫిట్‌గా లేకుంటే స్కాట్ బోలాండ్‌ని జట్టులోకి తీసుకుంటారని పాంటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
34 ఏళ్ల బోలాండ్ 2021లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌పై అద్భుతంగా అరంగేట్రం చేసినప్పటి నుంచి కేవలం ఏడు టెస్టుల్లోనే మొత్తం 28 వికెట్లు పడగొట్టాడు. ఇటువంటి పరిస్థితిలో, అతను ఇప్పుడు భారత్‌తో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు ముఖ్యమైన ఆయుధంగా నిరూపించుకోగలడు.
అయితే, మైఖేల్ నేజర్ రూపంలో ఆస్ట్రేలియా జట్టులో ఫాస్ట్ బౌలింగ్ కోసం మరొక ఎంపిక ఉంది. కానీ, భారత్‌తో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్‌లో ఆడాలంటే, నెజర్‌ను ముందుగా ఆస్ట్రేలియా 15 మంది WTC జట్టులో చేర్చాలి. ఇది మే 28న నిర్ధారించబడుతుంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం 33 ఏళ్ల మైఖేల్ నేజర్‌ను ఆస్ట్రేలియా జట్టులో చేర్చడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అతను ఇటీవల కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో 5 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 19 వికెట్లు తీసి 311 పరుగులు చేశాడు.
ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..