లక్ష్యం 78.. కానీ, 19 పరుగులకే ఆలౌట్.. 5గురు బ్యాట్స్‌మెన్స్ జీరోకే పెవిలియన్.. ఎక్కడో తెలుసా?

|

Aug 16, 2021 | 8:18 AM

ఈ మ్యాచ్‌లో మొత్తం 97 పరుగులు వచ్చాయి. ఇందులో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. ఒక్క నో బాల్ కూడా వేయలేదు. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్స్ పరుగులు సాధించలేక పెవిలియన్ చేరారు.

లక్ష్యం 78.. కానీ, 19 పరుగులకే ఆలౌట్.. 5గురు బ్యాట్స్‌మెన్స్ జీరోకే పెవిలియన్.. ఎక్కడో తెలుసా?
Cricket Pitch
Follow us on

ఆగస్టు 15 న, స్కార్చర్స్ మహిళా జట్టు ఐర్లాండ్‌లో జరిగిన అర్రకాస్ సూపర్ టీ 20 ట్రోఫీలో కేవలం 19 పరుగులకే ఆలౌట్ అయ్యారు. టైఫూన్స్ మహిళా జట్లు బౌలర్లు ఈ అద్భుతాన్ని సాధించి 59 పరుగుల విజయాన్ని అందించారు. టైఫూన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసిన సమయంలో 78 పరుగులు సాధించారు. బౌలర్ల ఆధిపత్యంతో ఈ టీం మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో, టైఫూన్స్ తరపున నలుగురు బౌలర్లు మాత్రమే బౌలింగ్ చేశారు. కేవలం 9.5 ఓవర్లలో స్కార్చర్స్ టీంను పెవిలియన్ చేర్చారు. ఈ మ్యాచ్‌లో నలుగురు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే సింగిల్ డిజిట్ సాధించారు. కాగా, మొత్తం నలుగురు జీరో పరుగులకే పెవిలియన్ చేరారు. స్కార్చర్స్ తరపున అత్యధిక స్కోరు ఎనిమిది పరుగులుగా నమోదైంది. అది కూడా ఆ టీం కెప్టెన్ లియా పాల్ సాధించాడు.

మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, టైఫూన్ల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. స్కార్చర్స్ బౌలింగ్ ముందు టైఫూన్ల బ్యాట్స్‌మెన్స్ ఎవరూ నిలబడలేకపోయారు. ఓర్లా ప్రేండర్‌గాస్ట్ (19), లూయిస్ లిటిల్ (12), సెలెస్టీ ర్యాక్ (11), రెబెక్కా స్టోకెల్ (10) మాత్రమే డబుల్ ఫిగర్‌ను దాటారు. ఈ నలుగురు తప్ప, ఎవరూ 10 పరుగులు చేరుకోలేకపోయారు. టైఫూన్స్ బ్యాటింగ్‌లో ఒక ఫోర్, రెండు సిక్సర్లు మాత్రమే ఉన్నాయి. అమీర్ రిచర్డ్సన్ స్కార్చర్స్ తరపున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా మారాడు. నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. లారా మారిట్జ్ 3 పరుగులకు 2 వికెట్లు, కారా ముర్రే 12 పరుగులకు 2 వికెట్లు తీశారు.

మొదటి 5 వికెట్లు కేవలం 8 పరుగులకే.. చివరి 5 వికెట్లు కూడా కేవలం 3 పరుగులలో..
79 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి స్కార్చర్ల బృందం బరిలోకి దిగింది. స్కోర్ చాలా చిన్నది. కానీ, వారు అనుకున్నది సాధించలేకపోయారు. మైదానంలో టైఫూన్స్ బౌలర్లు విధ్వంసం చేశారు. పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న వారు.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను అడ్డుకోవడంలో సఫలమయ్యారు. అవా క్యానింగ్, సెలెస్టే రేక్ బౌలింగ్ ముందు స్కార్చర్స్ జట్టు కేవలం ఎనిమిది పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్ మొదటి బంతికే ఈ వికెట్లు నేలరాలడం ప్రారంభమైంది. కెప్టెన్ లియా పాల్ వికెట్ల పతనాన్ని కొద్దిసేపు ఆపి, స్కోరును 16 పరుగులకు తీసుకెళ్లారు.

కానీ, ఆ తర్వాత మిగిలిన ఐదు వికెట్లు కూడా మూడు పరుగుల లోపలే పెవిలియన్ చేరాయి. దీంతో స్కార్చర్స్ జట్టు కేవలం 19 పరుగులకే చేతులెత్తేసింది. ఇందులో ఐదుగురు బ్యాట్స్ మెన్స్ ఖాతా తెరవకుండానే వారి ఇన్నింగ్స్ ముగించారు. అలాగే స్కార్చర్స్ జట్టు ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్, సిక్స్ కూడా కొట్టకపోవడం విశేషం. టైఫూన్ల బౌలర్లలో క్యానింగ్ తొమ్మిది పరుగులకు మూడు వికెట్లు, రేక్ ఎనిమిది పరుగులకు రెండు, లారా డెలానీ ఒక పరుగు ఇచ్చి రెండు, కెరిసన్ ఒక పరుగు ఇచ్చి ఒకటి వికెట్ పడగొట్టారు.

Also Read:

IND vs ENG: బాల్ టాంపరింగ్..! బూట్లతో బంతి ఆకారం మార్చేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్రయత్నం.. హెచ్చరించని అంపైర్లు

Neeraj Chopra: ఒలింపిక్ గోల్డెన్ బాయ్ మరో రికార్డు..! ఆటలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ సూపర్ ఫాస్టే అంటూ నెటిజన్ల కామెంట్లు