4 ఏళ్లుగా ఎదురుచూపులు.. అయినా టీమిండియాలో దక్కిన చోటు.. కట్ చేస్తే.. డేంజరస్ బౌలింగ్‌తో జట్టును ఫైనల్ చేర్చిన బౌలర్..
Jaydev Unadkat: కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ నాలుగు వికెట్లు తీసి సౌరాష్ట్రను ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.
విజయ్ హజారే ట్రోఫీ 2022 మొదటి సెమీ-ఫైనల్‌లో సౌరాష్ట్ర కర్ణాటకను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. సౌరాష్ట్ర విజయంలో ఆ జట్టు కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ 10 ఓవర్లలో 26 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. జయదేవ్ ప్రదర్శన ఆధారంగా, కర్ణాటక వంటి బలమైన జట్టు లొంగిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక కేవలం 171 పరుగులకే ఆలౌటైంది. సౌరాష్ట్ర జట్టు 36.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
జయదేవ్ ఉనద్కత్‌తో పాటు సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్ జై గోహిల్ 61 పరుగులు చేసి జట్టు విజయానికి గణనీయంగా సహకరించాడు. ప్రేరక్ మన్కడ్ 35, సమర్థ్ వ్యాస్ 33 పరుగుల వద్ద ఔటయ్యారు. చివర్లో చిరాగ్ జానీ, అర్పిత్ వాసవదా 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
టీమిండియాలో చోటు కోసం నాలుగేళ్లుగా ఎదురుచూపులు..
జయదేవ్ ఉనద్కత్ కెప్టెన్సీలో సౌరాష్ట్ర అద్భుత ప్రదర్శన చేసింది. ఈ జట్టు విజయ్ హజారే ట్రోఫీలో మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. జట్టుకు మంచి ప్రదర్శన చేసినా.. జయదేవ్‌కు గత నాలుగేళ్లుగా టీమ్‌ఇండియాలో అవకాశం రాకపోవడమే పెద్ద విషయంగా మారింది. ఈ ఆటగాడు 2018లో భారత్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు. జయదేవ్ ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్‌లో రాణిస్తున్నా.. జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు.
బ్యాటింగ్‌లో కుప్పకూలిన కర్ణాటక..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక లాంటి పటిష్ట బ్యాటింగ్ కూడా కుప్పకూలింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కేవలం 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. మనీష్ పాండే ఖాతా కూడా తెరవలేకపోయాడు. నికిన్ జోస్, శ్రేయాస్ గోపాల్ కూడా ఫెయిల్ అయ్యారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..