టెస్ట్‌ ప్లేయర్‌గా స్టాంప్ వేసి ఛీ కొట్టిన ఐపీఎల్, బీసీసీఐ.. కట్‌చేస్తే.. 47 బంతుల్లో దిమ్మతిరిగే షాకిచ్చాడుగా

Sarfaraz Khan Century: 2025 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో, ముంబై యువ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ అస్సాంపై అద్భుతమైన సెంచరీ సాధించాడు. అతను తన టీ20 కెరీర్‌లో తొలిసారిగా 100 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతను ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు.

టెస్ట్‌ ప్లేయర్‌గా స్టాంప్ వేసి ఛీ కొట్టిన ఐపీఎల్, బీసీసీఐ.. కట్‌చేస్తే.. 47 బంతుల్లో దిమ్మతిరిగే షాకిచ్చాడుగా
Sarfaraz Khan

Updated on: Dec 03, 2025 | 8:42 AM

Sarfaraz Khan Century: టీమిండియా టెస్ట్ క్రికెటర్, ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పొట్టి ఫార్మాట్‌లో (T20) తన సత్తా ఏంటో నిరూపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా అస్సాం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి తన టీ20 కెరీర్‌లోనే తొలి శతకాన్ని నమోదు చేశాడు. రెండు సంవత్సరాల తర్వాత తన మొదటి టీ20 మ్యాచ్ ఆడిన సర్ఫరాజ్, అస్సాం బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 47 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో అజేయంగా 100 పరుగులు (నాటౌట్) సాధించాడు.

సెంచరీ చెలరేగిన సర్ఫరాజ్ ఖాన్..

అస్సాంతో జరిగిన ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ కేవలం 47 బంతుల్లోనే 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 అద్భుతమైన సిక్సర్లు ఉన్నాయి. టీం ఇండియా తలుపులు తడుతున్న ఈ బ్యాట్స్‌మన్‌కు అత్యంత అవసరమైన సమయంలో ఈ ఇన్నింగ్స్ వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా, సర్ఫరాజ్ దేశీయ క్రికెట్‌లో పరుగులు సాధిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో నిలకడగా సెంచరీలు, తన తొలి టెస్ట్‌లో అర్ధ సెంచరీ చేసినప్పటికీ, అతను ఇప్పటికీ భారత జట్టులోకి ప్రవేశించడానికి ఇబ్బంది పడుతున్నాడు.

సర్ఫరాజ్ విధ్వంసానికి తోడు కెప్టెన్ అజింక్య రహానే (42), సూర్యకుమార్ యాదవ్ (20) రాణించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన అస్సాం జట్టు శార్దూల్ ఠాకూర్ (5 వికెట్లు) దెబ్బకు 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబై 98 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

సర్ఫరాజ్‌ ఇన్నింగ్స్ ఎందుకు ప్రత్యేకం?

సెలెక్టర్లకు సందేశం..

టెస్టుల్లో మంచి ఫామ్‌లో ఉన్నా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సర్ఫరాజ్‌ను పక్కన పెడుతున్నారన్న విమర్శల మధ్య ఈ శతకం సెలెక్టర్లకు గట్టి సమాధానం అని విశ్లేషకులు అంటున్నారు.

IPL వేలానికి ముందు..

ఐపీఎల్ 2026 మెగా వేలం దగ్గరపడుతున్న సమయంలో ఈ ఇన్నింగ్స్ సర్ఫరాజ్ డిమాండ్‌ను పెంచే అవకాశం ఉంది. గతంలో ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేదన్న పేరును చెరిపేసుకునేలా ఈ ఇన్నింగ్స్ సాగింది.

మొత్తానికి, టెస్టు బ్యాటర్‌గా ముద్రపడిన సర్ఫరాజ్ తాను ఏ ఫార్మాట్‌లోనైనా ప్రమాదకారిని అని ఈ సెంచరీతో నిరూపించుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..