Sanju Samson: సారథిగా సంజూ శాంసన్.. టీ20 టోర్నీతో సత్తా చాటేందుకు సిద్ధమైన కేరళ సూపర్ స్టార్..

Syed Mushtaq Ali Trophy T20 Tournament: శాంసన్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటి నను తాను మరోసారి నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో జాతీయ సెలెక్టర్ల మెప్పు పొందాలని చూస్తున్నాడు. గత నెలలో కర్ణాటక నుంచి బరిలోకి దిగిన ఆల్‌రౌండర్ శ్రేయాస్ గోపాల్ రూపంలో కేరళకు ఈసారి బలం చేకూరనుంది. లెగ్ స్పిన్నర్ గత రంజీ ట్రోఫీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన వెటరన్ స్పిన్నర్ జలజ్ సక్సేనాతో కలిసి కేరళ స్పిన్ దాడికి నాయకత్వం వహించనున్నాడు.

Sanju Samson: సారథిగా సంజూ శాంసన్.. టీ20 టోర్నీతో సత్తా చాటేందుకు సిద్ధమైన కేరళ సూపర్ స్టార్..
Sanju Samson

Updated on: Oct 12, 2023 | 8:13 PM

Syed Mushtaq Ali Trophy T20 tournament: అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 వరకు వివిధ వేదికలలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరగనుంది. ఈ T20 టోర్నమెంట్‌లో పాల్గొనే కేరళ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా యువ ఆటగాడు సంజూ శాంసన్ గురువారం నియమితుడయ్యాడు. ముంబైలో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో టోర్నీలో కేరళ తన గ్రూప్ బిలో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.

గ్రూప్‌లో సిక్కిం, అస్సాం, బీహార్, చండీగఢ్, ఒడిశా, సర్వీసెస్, చండీగఢ్‌లతో పాటు కేరళ, హెచ్‌పీ పోటీపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

సత్తా చాటేందుకు రెడీ..

శాంసన్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటి నను తాను మరోసారి నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో జాతీయ సెలెక్టర్ల మెప్పు పొందాలని చూస్తున్నాడు. గత నెలలో కర్ణాటక నుంచి బరిలోకి దిగిన ఆల్‌రౌండర్ శ్రేయాస్ గోపాల్ రూపంలో కేరళకు ఈసారి బలం చేకూరనుంది.

శ్రేయాస్ గోపాల్‌తో మరింత బలం..

లెగ్ స్పిన్నర్ గత రంజీ ట్రోఫీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన వెటరన్ స్పిన్నర్ జలజ్ సక్సేనాతో కలిసి కేరళ స్పిన్ దాడికి నాయకత్వం వహించనున్నాడు.

కోచ్‌గా మాజీ క్రికెటర్ వెంకటరమణ..

ప్రామిసింగ్ రోహన్ కున్నుమ్మల్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉండగా, తమిళనాడు మాజీ క్రికెటర్ ఎం వెంకటరమణ ఈ సీజన్‌లో కేరళకు ప్రధాన కోచ్‌గా ఉండనున్నాడు.

వన్డే ప్రపంచకప్ జట్టులో నో ఛాన్స్..

శాంసన్ కు వన్డే ప్రపంచకప్ లో చోటు దక్కుతుందని ఫ్యాన్స్ తోపాటు చాలామంది మాజీలు అనుకున్నారు. కానీ, బీసీసీఐ సెలెక్టెర్లు మాత్రం శాంసన్ కు మొండిచేయి చూపించారు. సూర్య కంటే వన్డేలో సత్తా చాటిన శాంసన్ ను పక్కన పెట్టడం ఏంటంటూ చాలామంది బీసీసీఐపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

కేరళ జట్టు:


సంజు శాంసన్ (కెప్టెన్, కీపర్), రోహన్ కున్నుమ్మల్ (వైస్ కెప్టెన్), శ్రేయాస్ గోపాల్, జలజ్ సక్సేనా, సచిన్ బేబీ, మహమ్మద్ అజారుద్దీన్, విష్ణు వినోద్, అబ్దుల్ బాసిత్, సిజోమన్ జోసెఫ్, విశాఖ్ చంద్రన్, బాసిల్ థంపి, కేఏం ఆసిఫ్, వినోద్ కుమార్, మను కృష్ణన్, వరుణ్ నాయనార్, ఎం అజ్నాస్, పీకే మిథున్, సల్మాన్ నిస్సార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..