IND Vs WI: టీమిండియాలోకి అన్‌లక్కీ ప్లేయర్ వచ్చేశాడు.. ఛాన్స్‌లు ఇస్తే మనోడే నెక్స్ట్ ధోని..!

|

Jun 24, 2023 | 8:20 PM

డబ్ల్యూటీసీ ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు టీమిండియా ఫోకస్ వన్డే ప్రపంచకప్‌పై పడింది. ఈ మెగా టోర్నమెంట్‌కు ముందుగా భారత్ 12 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.

IND Vs WI: టీమిండియాలోకి అన్‌లక్కీ ప్లేయర్ వచ్చేశాడు.. ఛాన్స్‌లు ఇస్తే మనోడే నెక్స్ట్ ధోని..!
India Vs Wi Squad
Follow us on

డబ్ల్యూటీసీ ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు టీమిండియా ఫోకస్ వన్డే ప్రపంచకప్‌పై పడింది. ఈ మెగా టోర్నమెంట్‌కు ముందుగా భారత్ 12 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో భాగంగానే మొదటిగా వెస్టిండీస్‌తో మూడు వన్డేలు ఆడనుంది రోహిత్ సేన. అనూహ్యంగా సెలెక్టర్లు కొందరు యువ ప్లేయర్లకు ఈ సిరీస్‌లో అవకాశం కల్పించారు. ఎప్పటినుంచో టీమిండియాలో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్‌ మళ్లీ బ్లూ జెర్సీలో కనిపించనున్నాడు. మిడిలార్డర్‌లో ప్రధాన ఆటగాడైన శ్రేయాస్ అయ్యర్ దూరం కావడంతో.. ఈ విండీస్ సిరీస్‌లో సంజూ శాంసన్‌కు పుష్కలంగా అవకాశాలు లభించవచ్చు. అటు వికెట్ కీపింగ్.. ఇటు బ్యాటింగ్‌లో శాంసన్ రాణిస్తే.. కచ్చితంగా ప్రపంచకప్‌లో మనోడికి ఛాన్స్ రావచ్చు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో రాయల్స్‌కు కెప్టెన్‌గా, అటు బ్యాటర్‌గా సంజూ శాంసన్ అద్భుతంగా రాణించాడు. మొత్తం 13 ఇన్నింగ్స్‌లలో 360 పరుగులు చేశాడు. అటు రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా దూరం కావడంతో.. శాంసన్‌కు మరో అవకాశం ఈ వెస్టిండీస్ టూర్‌లో దక్కింది. అతడు దొరికిన ఛాన్స్ సద్వినియోగం చేసుకుంటే.. అన్‌లక్కీ ప్లేయర్ కాస్తా.. లక్కీ అయిపోతాడు.

కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ గాయాలతో సతమతమవుతుండగా.. రిషబ్ పంత్ ఈ ఏడాది చివరి వరకు అందుబాటులో ఉండడు. దీంతో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌కు టీ20లు, వన్డేల్లో ఎక్కువగా అవకాశాలు రావచ్చు. వెస్టిండీస్‌లో వీరి ఆటతీరును పరిగణనలోకి తీసుకునే.. ప్రపంచకప్‌కు వికెట్ కీపర్ బ్యాకప్ ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం ఉంది బీసీసీఐ.