61 బంతుల్లో ఒక్క పరుగు చేయలేదు.. కట్ చేస్తే.. 20 సిక్సర్లతో ఊహకందని ఊచకోత.. ఎవరంటే.?

ఈ బ్యాటర్ మాములోడు కాదు భయ్యా.! 37 రోజుల్లో మూడో డబుల్ సెంచరీ చేసేశాడు. బరిలోకి దిగాడు అంటే బ్యాట్ తో ఊచకోత కోసినట్టే. తాజాగా సీకే నాయుడు ట్రోఫీలో మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అసలు ఆ ప్లేయర్ ఎవరో తెల్సా

61 బంతుల్లో ఒక్క పరుగు చేయలేదు.. కట్ చేస్తే.. 20 సిక్సర్లతో ఊహకందని ఊచకోత.. ఎవరంటే.?
Rizvi

Updated on: Jan 28, 2025 | 5:22 PM

ఇది మాములు విధ్వంసం కాదురా భయ్యా.! వరుసపెట్టి డబుల్ సెంచరీలు కొట్టేస్తున్నాడు ఈ ప్లేయర్. అండర్-23 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతోన్న ఈ ప్లేయర్ గుజరాత్‌పై సంచలనం సృష్టించాడు. అతడు మరెవరో కాదు సమీర్ రిజ్వీ. గుజరాత్‌పై 159 బంతులను ఎదుర్కొని ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇందులో అతడు 61 బంతులకు ఒక్క పరుగు చేయకపోగా.. ఆ తర్వాత పేలుడు ఇన్నింగ్స్‌తో డబుల్ సెంచరీ సాధించాడు. గత 37 రోజుల్లో సమీర్ రిజ్వీకి ఇది మూడో డబుల్ సెంచరీ.

20 సిక్సర్లతో డబుల్ హండ్రడ్..

గుజరాత్‌తో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ సమీర్ రిజ్వీ తన దూకుడైన ఆటతీరు ప్రదర్శించాడు. గుజరాత్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 164.78 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి ఉత్తరప్రదేశ్ బ్యాటర్ సమీర్ రిజ్వీ 159 బంతుల్లో 20 సిక్సర్లు, 21 ఫోర్లతో 262 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే సమీర్ రిజ్వీ రెండో ఇన్నింగ్స్‌లో తన సహచర బ్యాటర్ స్వస్తిక్ చికారాతో కలిసి రెండో వికెట్‌కు 381 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇవి కూడా చదవండి

37 రోజుల్లో మూడో డబుల్ సెంచరీ..

గత 37 రోజుల్లో సమీర్ రిజ్వీకి ఇది మూడో డబుల్ సెంచరీ. డిసెంబర్ 21న త్రిపురతో జరిగిన మ్యాచ్‌తో ఈ ఊచకోత మొదలైంది. అండర్-23 స్టేట్-ఎ ట్రోఫీ మ్యాచ్‌లో సమీర్ 97 బంతుల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత కేవలం 4 రోజుల్లోనే డిసెంబర్ 25న సమీర్ రిజ్వీ బ్యాట్ మరోసారి రెచ్చిపోయింది. ఈసారి విదర్భ జట్టుపై 105 బంతుల్లో 202 పరుగులు చేసింది. ఇక ఇప్పుడు ఇది మూడో డబుల్ సెంచరీ.

ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ ఖుషీ..

ఫార్మాట్ ఏదైనా, వేదిక ఎక్కడైనా సరే.. సమీర్ రిజ్వీ బ్యాట్‌ ఝుళిపిస్తున్నాడు. అతడిన శైలిలో అదరగొడుతున్నాడు. తాజాగా ఐపీఎల్ 2025లో సమీర్ రిజ్వీని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. అతడ్ని రూ.95 లక్షలకు దక్కించుకుంది. సమీర్ గత IPLలో CSKలో భాగమయ్యాడు, ఆ సమయంలో అతడు 8 మ్యాచ్‌లు ఆడాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి