Watch Video: ఇండోర్ స్టేడియంలో వెరైటీ సిక్స్‌లు.. అంపైర్ల తీర్పుతో ఫీల్డర్లు షాక్.. వీడియో చూసి షాకవుతోన్న నెటిజన్లు..

|

Jan 15, 2023 | 7:05 AM

Big Bash League: బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంతి రెండు సార్లు స్టేడియం పైకప్పును తాకింది. రెండు సార్లు బంతి పైకప్పునకు చేరింది.

Watch Video: ఇండోర్ స్టేడియంలో వెరైటీ సిక్స్‌లు.. అంపైర్ల తీర్పుతో ఫీల్డర్లు షాక్.. వీడియో చూసి షాకవుతోన్న నెటిజన్లు..
Bbl Viral Video
Follow us on

బిగ్ బాష్ లీగ్ టోర్నమెంట్‌తో ఆస్ట్రేలియా దేశవాళీ లీగ్ కొనసాగుతోంది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టు శనివారం మెల్‌బోర్న్ స్టార్స్ ముందు నిలిచింది. ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ 6 పరుగుల తేడాతో మెల్‌బోర్న్ స్టార్స్‌పై విజయం సాధించింది. సామ్ హార్పర్ మెల్బోర్న్ రెనెగేడ్స్ విజయానికి హీరోగా నిలిచాడు. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున శామ్ హార్పర్ అద్భుత అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో, ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ బంతిని కనపడనంత దూరం కొట్టేశాడు. అయితే, ఆ బంతి పైకప్పును తాకడం రెండుసార్లు జరిగింది. దీంతో బ్యాట్స్‌మెన్ ఖాతాలో 6 పరుగులు వచ్ఇచ చేరాయి. అయితే, బ్యాట్స్‌మెన్ షాట్ పైకప్పును తాకిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

స్టేడియం పైకప్పునకు తాకిన బంతి..

ఈ ఘటన జరిగినప్పుడు మెల్‌బోర్న్ స్టార్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ జరుగుతోంది. నిజానికి ఈ ఓవర్ ఐదో బంతికి జో క్లార్క్ మిడ్ వికెట్ మీదుగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఆ బంతి 38 మీటర్ల దూరంలో ఉన్న స్టేడియం పైకప్పును తాకింది. స్టేడియం పైకప్పును తాకిన బంతి మరలా పిచ్‌పై పడింది. ఆ తర్వాత, మెల్‌బోర్న్ స్టార్స్ 16వ ఓవర్‌లో రెండోసారి ఈ సంఘటన జరిగింది. ఈసారి బ్యాట్‌కు తగిలిన బంతి గాలిలోకి చాలా ఎత్తుకు వెళ్లింది. ఆ తర్వాత, పైకప్పును తాకడంతో బంతి లెగ్ సైడ్ వైపు పడింది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వీడియో వైరల్..

అయితే బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌కు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై అభిమానులు కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరోవైపు, ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, టాస్ ఓడిపోయి, ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న మెల్బోర్న్ రెనెగేడ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఈ విధంగా మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ విజయం సాధించేందుకు 20 ఓవర్లలో 163 ​​పరుగులు చేయాల్సి ఉండగా, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ 6 పరుగుల తేడాతో మెల్‌బోర్న్ స్టార్స్‌ను ఓడించింది. అంతకుముందు శామ్ హార్పర్ 36 బంతుల్లో 51 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కాకుండా జోనాథన్ వెల్స్ 44 పరుగులు చేశాడు. మాథ్యూ క్రిచ్లీ 23 పరుగుల కీలక సహకారం అందించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..