Sachin Tendulkar:క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో నవంబర్ 16కి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజు టెండూల్కర్ కెరీర్‌లోనే కాకుండా భారత క్రికెట్ చరిత్రలో కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు సచిన్ టెండూల్కర్ తన 200వ టెస్టు ఆడారు కెరీర్‌లో చివరిసారిగా మైదానంలోకి అడుగుపెట్టారు.16 నవంబర్ 2013 సచిన్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్‌లో చివరి రోజు. ఆ చారిత్రాత్మక రోజు నుంచి ఇప్పటివరకు 8 సంవత్సరాలు గడిచాయి. అయితే మైదానం లోపల బ్యాట్‌తో మ్యాజిక్‌ను పంచిన సచిన్.. రిటైర్మెంట్ తర్వాత సామాజిక సేవ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
నవంబర్ 16, మంగళవారం రోజున సచిన్ టెండూల్కర్ మధ్యప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామం సేవనియాను సందర్శించారు. అక్కడ ఆర్థికంగా-సామాజికంగా వెనుకబడిన పిల్లలతో సమావేశమయ్యారు. తన ఫౌండేషన్ కింద ఈ పిల్లలకు అందుతున్ను సేవల గురించి చర్చించారు. సచిన్ టెండూల్కర్ తన తండ్రి రమేష్ టెండూల్కర్ జ్ఞాపకార్థం ఒక పాఠశాలతో సహా అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. టెండూల్కర్ ఫౌండేషన్ పిల్లలకు పౌష్టికాహారం అందించడం, ‘సేవా కుటీర్’ ద్వారా క్రీడలలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుంది.
సచిన్ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పిల్లలను కలవడం, వారి కోసం చేస్తున్న పురోగతి గురించి అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు పిల్లలతో మాట్లాడుతున్న ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. సచిన్ తన పోస్ట్‌లో “టీమ్ ఇండియా కోసం మైదానంలో, వెలుపల ఆడటం ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకత. మా సేవా కుటీర్ మేము నిర్మిస్తున్న పాఠశాలను ‘కుటుంబం’తో కలిసి సందర్శించడం చాలా సంతృప్తికరంగా ఉంది. పిల్లలు ఈ ప్రపంచాన్ని మరింత మెరుగ్గా, ప్రకాశవంతంగా మార్చగలరు. వారికి సమాన అవకాశాలు లభించేలా చూడాలి” అన్నారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో గిరిజన బాలికలు, బాలురకు ఉచిత విద్య సౌకర్యం లభిస్తుంది.
Always a privilege to play for #TeamIndia – on the field or off it. Was satisfying to visit our seva kutirs & free residential school we are building with Parivaar.
Our children can make this world better & brighter. We just have to ensure all of them get equal opportunities. pic.twitter.com/0sqVRg2Fwl
— Sachin Tendulkar (@sachin_rt) November 16, 2021