Virat Kohli: మొదటిసారిగా కోహ్లీ పేరు అప్పుడే విన్నా.. 100వ టెస్ట్‌కు ముందు విరాట్‌కు సచిన్ సందేశం..

భారత మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar).. 100వ టెస్టు మ్యాచ్‌కి ముందు విరాట్ కోహ్లీ(Virat Kohli)కి సందేశాన్ని పంపాడు...

Virat Kohli: మొదటిసారిగా కోహ్లీ పేరు అప్పుడే విన్నా.. 100వ టెస్ట్‌కు ముందు విరాట్‌కు సచిన్ సందేశం..
Sachin

Updated on: Mar 03, 2022 | 1:35 PM

భారత మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar).. 100వ టెస్టు మ్యాచ్‌కి ముందు విరాట్ కోహ్లీ(Virat Kohli)కి సందేశాన్ని పంపాడు. బీసీసీఐ(BCCI) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో టెండూల్కర్ సందేశం ఉంది. టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సహా 100-టెస్ట్ క్లబ్‌లోని ఇతర సభ్యుల సందేశాలు ఇచ్చారు. సచిన్ విరాట్ కోహ్లీ పేరును మొదటిసారిగా ఎప్పుడు విన్నాడో చెప్పాడు. “మేము 2007లో ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు కోహ్లీ గురించి మొదటిసారి విన్నాను. అప్పుడు కోహ్లీ మలేషియాలో U-19 ప్రపంచ కప్ ఆడుతున్నారు. ఆ సమయంలో జట్టులో కొంతమంది ఆటగాళ్లు అతని గురించి చర్చించుకున్నారు. ‘అచ్చి బ్యాటింగ్ కర్తా హై’ అని సచిన్ వీడియోలో సచిన్ పేర్కొన్నాడు.

కోహ్లీ ఇప్పటివరకు 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. శ్రీలంకతో శుక్రవారం నుంచి మొహాలీలో ప్రారంభమయ్యే మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడడంతో కోహ్లీ 100-టెస్ట్ క్లబ్‌లో చేరతాడు. ద్రావిడ్ కూడా కోహ్లీ ప్రతిభను గురించి గొప్పగా చెప్పాడు. భారత్ అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీ విజయవంతమైయ్యాడని అన్నాడు. ఒక్క మ్యాచ్‌ ఆడగలగడం చాలా గొప్ప విషయం. అలాంటిది 100 మ్యాచ్‌లు ఆడటం ఒక అద్భుతమైన విజయమని పెర్కొన్నాడు. “ఇది విరాట్ కోహ్లీ చాలా గర్వించదగిన ఘనత. ఆల్ ది బెస్ట్, ఈ రోజును ఆస్వాదించండి, ఈ సందర్భాన్ని ఆస్వాదించండి, ఇది చాలా గర్వించదగిన విషయం,” అని భారత ప్రధాన కోచ్ చెప్పాడు. 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 71వ క్రికెటర్‌గా కోహ్లీ నిలవనున్నాడు. ఈ ఘనత సాధించిన 12వ భారత క్రికెటర్‌గా కూడా కోహ్లీ నిలవనున్నాడు.

Read Also.. IPL 2022: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. మ్యాచ్‌లు చూడడానికి స్టేడియానికి వెళ్లొచ్చు.. కానీ..