
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. రాబోయే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) T20 2025 కోసం తన ప్రిపరేషన్‌ను తెలియజేస్తూ, తన ఐకానిక్ పోజ్‌తో “నేను సిద్ధంగా ఉన్నాను, మీరు?” అంటూ ట్వీట్ చేయడం క్రికెట్ ప్రేమికులను విపరీతంగా ఉత్సాహపరిచింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, అభిమానులు లెజెండరీ బ్యాటర్‌ను మళ్లీ మైదానంలో చూడబోతున్నామనే ఆనందంతో ఫిదా అయ్యారు.
IML T20 2025 టోర్నమెంట్ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 16 వరకు నవీ ముంబై, రాయ్‌పూర్, లక్నో వేదికలపై జరుగనుంది. మొత్తం ఆరు జట్లు పోటీపడనున్నాయి. అవి, ఇండియా మాస్టర్స్, శ్రీలంక మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్, ఇంగ్లండ్ మాస్టర్స్, దక్షిణాఫ్రికా మాస్టర్స్. ఇండియా మాస్టర్స్‌కు సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, శ్రీలంకకు కుమార సంగక్కర, వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్, దక్షిణాఫ్రికాకు జాక్వెస్ కల్లీస్ కెప్టెన్లుగా ఉన్నారు.
సచిన్ టెండూల్కర్ నెట్స్‌లో చెమటోడుస్తూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రేడ్‌మార్క్ స్ట్రైట్ డ్రైవ్‌లతో అభిమానులను ఆకట్టుకుంటున్న మాస్టర్ బ్లాస్టర్, తన ఫుట్‌వర్క్‌తో మరోసారి క్రికెట్ మేజిక్‌ను చూపిస్తున్నాడు. ఈ వీడియోపై నెటిజన్లు, “ది గోట్ ఈజ్ బ్యాక్!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
IML T20 2025 ద్వారా రిటైర్ అయిన క్రికెట్ లెజెండ్స్ మళ్లీ తమ ప్రతిభను ప్రదర్శించబోతున్నారు. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో ఇండియా మాస్టర్స్ ఎలా రాణిస్తుందో చూడాలి!
సచిన్ టెండూల్కర్ (సి), యువరాజ్ సింగ్, సురేష్ రైనా, అంబటి రాయుడు, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్, షాబాజ్ నదీమ్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, పవన్ నేగి, గురుకీరత్ సింగ్ మాన్, అభిమన్యు మిథున్.
The 𝐌𝐚𝐬𝐭𝐞𝐫 𝐁𝐥𝐚𝐬𝐭𝐞𝐫 is gearing up to steal the show at the #IMLT20 🙌💙
Watch 𝙎𝙖𝙘𝙝𝙞𝙣 𝙏𝙚𝙣𝙙𝙪𝙡𝙠𝙖𝙧 go through his rituals before stepping onto the grand stage once again! 🤌🤩#TheBaapsOfCricket #SachinTendulkar pic.twitter.com/E7cs20YwGH
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) February 17, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..