SA vs ENG Playing XI: సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. ప్లేయింగ్ 11 నుంచి కెప్టెన్ ఔట్.. ఇరుజట్లు ఎలా ఉన్నాయంటే?

ICC Men’s ODI world cup England vs South Africa Playing XI: పాయింట్ల పట్టికలో టాప్-4 రేసు కీలకంగా మారినందున ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. గత మ్యాచ్‌లో ఇరు జట్లూ ఓటమి చవిచూశాయి. దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. కాగా, ఆఫ్ఘనిస్థాన్‌పై ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య 7 మ్యాచ్‌లు జరగ్గా, దక్షిణాఫ్రికా 3, ఇంగ్లండ్ 4 గెలిచాయి.

SA vs ENG Playing XI: సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. ప్లేయింగ్ 11 నుంచి కెప్టెన్ ఔట్.. ఇరుజట్లు ఎలా ఉన్నాయంటే?
Sa Vs Eng

Updated on: Oct 21, 2023 | 2:33 PM

ICC Men’s ODI world cup England vs South Africa Playing XI: వన్డే ప్రపంచకప్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆరోజు రెండో మ్యాచ్ సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య జరుగుతోంది. ఇందులో భాగంగా ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ మొదలైంది.

దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా నేడు ఆడడం లేదు. బావుమా అనారోగ్యంతో ఉన్నాడు. అతని గైర్హాజరీలో ఐడెన్ మార్క్రామ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇంగ్లండ్ జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. బెన్ స్టోక్స్ గాయం నుంచి తిరిగి వచ్చాడు. క్రిస్ వోక్స్ స్థానంలో డేవిడ్ విల్లీ, సామ్ కుర్రాన్ స్థానంలో గుస్ అట్కిన్సన్ ఆడనున్నారు.

పాయింట్ల పట్టికలో టాప్-4 రేసు కీలకంగా మారినందున ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. గత మ్యాచ్‌లో ఇరు జట్లూ ఓటమి చవిచూశాయి. దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. కాగా, ఆఫ్ఘనిస్థాన్‌పై ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు.

రెండు జట్ల ప్లేయింగ్ XI..

ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/కెప్టెన్), డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ.

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, లుంగీ ఎన్గిడి.

ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌దే పైచేయి..

వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య 7 మ్యాచ్‌లు జరగ్గా, దక్షిణాఫ్రికా 3, ఇంగ్లండ్ 4 గెలిచాయి.

వాతావరణ పరిస్థితులు..

ముంబైలోని వాంఖడే స్టేడియంలో వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రత 35 డిగ్రీల వరకు ఉండొచ్చు. మేఘావృతమై ఉంటుంది. కానీ, వర్షం పడే అవకాశం లేదు.

పిచ్ పరిస్థితి..

వాంఖడే స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్‌కు సహాయకరంగా పరిగణిస్తుంటారు. ఇది కాకుండా, చిన్న బౌండరీలు బ్యాట్స్‌మెన్‌కు ఆటను సులభతరం చేస్తాయి. పిచ్ ప్రారంభ ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లకు ప్రయోజనాన్ని ఇస్తుంది. మ్యాచ్ పురోగమిస్తున్న కొద్దీ, బౌలర్లకు ఇబ్బందులు పెరుగుతాయి.

మరిన్ని కీలక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..