Video: వామ్మో.. సూర్యనే మించిపోయాడుగా.. 360 షాట్లతో ఐపీఎల్ రూ.50 లక్షల ప్లేయర్ ఊచకోత.. కేవలం 13 బంతుల్లోనే..

|

Jan 12, 2023 | 8:11 AM

IPL 2023: ఐపీఎల్ 2023కి ఎంపికైన చాలా మంది ఆటగాళ్ళు ఈ లీగ్‌కి ముందు దక్షిణాఫ్రికా కొత్త టోర్నమెంట్ SA 20లో తమ సత్తా చాటుతున్నారు. అందులో ఫెరీరా రెండో మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టించాడు.

Video: వామ్మో.. సూర్యనే మించిపోయాడుగా.. 360 షాట్లతో ఐపీఎల్ రూ.50 లక్షల ప్లేయర్ ఊచకోత.. కేవలం 13 బంతుల్లోనే..
Sa 20 Joburg Donovan Ferrei
Follow us on

ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి సమయం ఉంది. కానీ, అలాంటి వాతావరణం ఇప్పటికే సిద్ధమైంది. డిసెంబర్ 23న కొచ్చిలో వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో చాలా మంది పెద్ద పేర్లు కనిపించాయి. మరికొందరు కొత్త ఆటగాళ్లు కూడా తమ బ్యాగ్‌లో డబ్బులు నింపుకున్నారు. అయితే, ఇలాంటి వారిలో కొందరు దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ తొలి సీజన్‌‌లో బరిలోకి దిగారు. దీంతో ఐపీఎల్‌ సీజన్‌కు ముందే వీరిలో చాలా మంది ఆటగాళ్లు తమ సత్తా చాటుకునే అవకాశం లభించింది. కొత్త లీగ్ ప్రారంభం అద్భుతంగా ఉంది. రెండవ మ్యాచ్‌లో ఐపీఎల్ వేలానికి ముందు కొద్దిమందికి తెలిసిన ఆటగాడు, తన 40 బంతుల ఇన్నింగ్స్‌తో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. కొన్ని షాట్లు మాత్రం సూర్యను తలపించేలా చేశాడు. కిందపడుతూ, క్రీజు దాటుతూ 360 షాట్లు బాదేశాడు.

ఎస్‌ఏ20 లీగ్‌లోని రెండవ మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ వర్సెస్ జోబర్గ్ సూపర్ కింగ్స్ జనవరి 11వ తేదీ బుధవారం ముఖాముఖిగా తలపడ్డాయి. జోబర్గ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఇందులో టాప్, మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసీ ఏదో చేయాలనుకున్నాడు. కానీ, అతని ప్రయత్నం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. కేవలం 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సూపర్ కింగ్స్‌కు భారీ ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

ఇవి కూడా చదవండి

104 మీటర్ల సిక్సర్..

24 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ డోనోవన్ ఫెరీరా సరిగ్గా ఇదే సమయంలో తన బ్యాట్‌ను ఝలిపించాడు. క్రీజులోకి వచ్చిన తర్వాత, ఫెరీరా బౌలర్లను చీల్చి చెండాడు. భారీ షాట్లతో బౌండరీలు బాదుతూ, అభిమానలు బాగా ఎంటర్‌టైన్ చేశాడు. ఇందులో ఒక సిక్స్ నేరుగా 104 మీటర్ల దూరం దూసుకెళ్లింది. కేవలం 28 బంతుల్లోనే ఫెరీరా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

13 బంతుల్లో 62 పరుగులు..

ఫిఫ్టీ పూర్తి చేసిన తర్వాత, ఫెరీరా మరింత సంచలనం సృష్టించాడు. ఈ బ్యాట్స్‌మన్ మళ్లీ బౌండరీల వర్షం కురిపించి, చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టును 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగుల భారీ స్కోరుకు తీసుకెళ్లాడు. ఫెరీరా కేవలం 40 బంతుల్లో 205 స్ట్రైక్ రేట్‌తో 82 పరుగులు చేశాడు. అందులో 62 పరుగులు కేవలం 13 బంతుల్లో 5 సిక్స్‌లు, 8 ఫోర్లు వచ్చాయి. అతనితో పాటు, రొమారియో షెపర్డ్ కూడా విజృంభించాడు. కేవలం 19 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 40 పరుగులు చేశాడు.

రూ. 50 లక్షలకు రాజస్థాన్ కొనుగోలు..

గత నెలలో జరిగిన ఐపీఎల్ వేలంలో డొనోవన్ ఫెరీరా పేరు తెరపైకి వచ్చింది. కొచ్చిలో జరిగిన ఈ వేలంలో, ఫెరీరా బేస్ ధర రూ. 20 లక్షలు మాత్రమే. అతని పేరు దక్షిణాఫ్రికా వెలుపల ఎవరికీ వినిపించలేదు. అయితే అతని పేరు రాగానే కొన్ని జట్ల మధ్య బిడ్డింగ్ వార్ మొదలైంది. కానీ.. చివరికి ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ ఇన్నింగ్స్‌కు ముందు ఫెరీరా 21 టీ20 ఇన్నింగ్స్‌లలో 153 స్ట్రైక్ రేట్‌తో 539 పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..