Ruturaj Gaikwad: బ్యాట్‌తోనే కాదు అలా కూడా మనసులు గెల్చుకున్న టీమిండియా క్రికెటర్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారాన్ని..

|

Nov 29, 2022 | 11:00 AM

ఓకే ఓవర్లో ఏడు సిక్సర్లు కొట్టడంతో పాటు డబుల్‌ సెంచరీ సాధించిన రుతురాజ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ ఫ్యాన్స్‌ అతనిని పొగుడుతూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు.

Ruturaj Gaikwad: బ్యాట్‌తోనే కాదు అలా కూడా మనసులు గెల్చుకున్న టీమిండియా క్రికెటర్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారాన్ని..
Ruturaj Gaikwad
Follow us on

విజయ్ హజారే టోర్నీలో భాగంగా ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ డబుల్ సెంచరీ (220)తో చెలరేగాడు. ముఖ్యంగా ఒకే ఓవర్లో 7 సిక్సర్లు కొట్టి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా మహారాష్ట్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ఈ భారీ స్కోరును ఛేదించలేక ఉత్తర ప్రదేశ్‌ చతికిలపడిపోయింది. ఆర్యన్ జుయెల్ (159) భారీ సెంచరీతో చెలరేగినా చివరికి 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ 159 బంతుల్లో మొత్తం 220 పరుగులు చేశాడు. ఇందులో10 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి. కాగా ఓకే ఓవర్లో ఏడు సిక్సర్లు కొట్టడంతో పాటు డబుల్‌ సెంచరీ సాధించిన రుతురాజ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ ఫ్యాన్స్‌ అతనిని పొగుడుతూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు.

ఈ మెరుపు ఇన్నింగ్స్‌కు గానూ మహారాష్ట్ర జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ప్లేయర్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అయితే రుతురాజ్ ఈ అవార్డును మరో క్రికెటర్‌తో పంచుకుని అందరి మనసులు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో యంగ్‌ ఫాస్ట్‌బౌలర్‌ రాజవర్ధన్ 10 ఓవర్లలో 53 పరుగులిచ్చి 5 కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందుకు గానూ తనకు వచ్చిన ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారాన్ని రాజవర్దన్‌తో కలిసి షేర్‌ చేసుకున్నాడు. దీంతో ఆటతోనే తన ప్రవర్తనతోనూ అందరి మనసులు గెల్చుకున్నాడు రుతురాజ్‌. కెప్టెన్ తన సహచరుల ఆటతీరును ఎలా ప్రోత్సహించాలో రుతురాజ్ చూపించాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

సెమీస్‌లో మహారాష్ట్ర

విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్ నవంబర్ 30న జరగనుంది. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్రతో కర్ణాటక తలపడనుంది. కాగా , మహారాష్ట్ర జట్టు అస్సాంతో తలపడనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..