Ruturaj Gaikwad : సాహో రుతురాజ్..కెరీర్‌లో తొలి వన్డే సెంచరీ.. కోహ్లీతో 150 పరుగుల భాగస్వామ్యం
భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండవ మ్యాచ్ రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ భారత్‌కు టాస్ కలిసి రాలేదు. కెప్టెన్ వరుసగా 20వ సారి టాస్‌ను కోల్పోయాడు. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్‌కు దిగింది.

Ruturaj Gaikwad : భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండవ మ్యాచ్ రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ భారత్‌కు టాస్ కలిసి రాలేదు. కెప్టెన్ వరుసగా 20వ సారి టాస్‌ను కోల్పోయాడు. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో గెలిచిన భారత్, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. సౌతాఫ్రికా జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో కెప్టెన్ టెంబా బావుమా, కేశవ్ మహారాజ్, లుంగీ ఎంగిడితో సహా మూడు మార్పులు చేసింది. భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్, యశస్వి (22)ల వికెట్లు త్వరగా కోల్పోవడంతో కాస్త నిరాశ ఎదురైంది. అయితే, మూడో వికెట్‌కు క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. ఈ ఇద్దరూ కలిసి పరుగుల వరద పారించారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో కేవలం 52 బంతుల్లోనే తన రెండవ వన్డే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడిన రుతురాజ్, తన కెరీర్‌లో తొలి వన్డే సెంచరీని పూర్తి చేసి భారత శిబిరాన్ని ఆనందంలో ముంచెత్తాడు. 77బంతుల్లో గైక్వాడ్ సెంచరీ కొట్టాడు. 105 పరుగుల వద్ద యన్సెన్ బౌలింగులో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇటు విరాట్ కోహ్లీ కూడా 47 బంతుల్లో తన 76వ వన్డే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.
కోహ్లీ, రుతురాజ్ కలిసి మూడో వికెట్‌కు బలమైన పునాది వేశారు. ఈ జోడీ మొదట 104 బంతుల్లో 114 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేసింది. ఆ తర్వాత కూడా వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ, 150 పరుగుల మార్క్‌ను కూడా దాటి దూసుకుపోయింది. ఈ భాగస్వామ్యం కారణంగా 35 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు దాటింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




