RR vs SRH Highlights, IPL 2023: సూపర్ థ్రిల్లర్ సినిమాను తలపించిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సెన్సేషనల్ విక్టరీ సాధించింది. ఆదివారం రాత్రి జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (RR)తో జిరగిన మ్యాచ్లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ ముందు 215 పరుగుల టార్గెట్ నిలిచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ సీజన్‌లో ఈరోజు మళ్లీ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య రోజు రెండో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ టీం తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ మొదట బౌలింగ్ చేయనుంది.
హైదరాబాద్‌పై రాజస్థాన్ గెలిస్తే, హైదరాబాద్‌పై వరుసగా మూడో విజయం అవుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగే తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ (GT), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరగనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, వివ్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కీపర్/కెప్టెన్), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, సందీప్ శర్మ, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్.
సూపర్ థ్రిల్లర్ సినిమాను తలపించిన మ్యాచ్లో హైదరాబాద్ అద్బుత విజయం సాధించింది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 215 పరుగుల టార్గెట్ ను చివరి బంతికి అందుకుంది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఛేదనలో అబ్దుల్ సమద్ ( 7 బంతుల్లో 17) చివరి బంతికి బౌండరీ కొట్టి హైదరాబాద్ విజయాన్ని ఖరారు చేశాడు
We chased 215. pic.twitter.com/e6uGaZqgzo
— SunRisers Hyderabad (@SunRisers) May 7, 2023
రాహుల్ త్రిపాఠి మెరుపు బ్యాటింగ్ చేస్తున్నాడు. కేవలం 27 బంతుల్లో 47 పరుగులు చేసి హైదరాబాద్‌ను విజయం వైపు తీసుకెళుతున్నాడు. అతనికి తోడుగా కెప్టెన్ మర్‌క్రమ్ ఉన్నాడు. ఎస్‌ఆర్ హెచ్ విజయానికి 18 బంతుల్లో 44 పరుగులు అవసరం.
Klaasen's cameo comes to an end ?
5️⃣7️⃣ needed in last 4️⃣ overs ? pic.twitter.com/jo7W1mtFKk
— SunRisers Hyderabad (@SunRisers) May 7, 2023
215 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్ దూకుడుగా ఆడుతోంది. 11.4 ఓవర్లలోనే ఆ జట్టు 100 పరుగుల స్కోరు అందుకుంది. అభిషేక్ శర్మ (30 బంతుల్లో 47) చెలరేగి ఆడుతున్నాడు. కెప్టెన్ మర్ క్రమ్ (16 బంతుల్లో 24) ధాటిగానే ఆడుతున్నాడు. అంతకుముందు అనుమోల్ ప్రీత్ 25 బంతుల్లో 33 పరుగులు చేసి ఔటయ్యాడు.
Two set batters in the crease. Time to up the ante ? pic.twitter.com/SKd0eMmwjW
— SunRisers Hyderabad (@SunRisers) May 7, 2023
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 52వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 215 పరుగుల లక్ష్యాన్ని అందించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శాంసన్ సేన 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు 18.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్, షిమ్రాన్ హెట్మెయర్ క్రీజులో ఉన్నారు. సెంచరీకి 5 పరుగుల దూరంలో బట్లర్ (95) పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.
రాజస్థాన్ రాయల్స్ టీం 16 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 168 పరుగులు చేసింది.
జోస్ బట్లర్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేశాడు. ఇందులో 5 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
రాజస్థాన్ రాయల్స్ టీం 11 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. బట్లర్ 43, శాంసన్ 30 పరుగులతో నిలిచారు.
రాజస్థాన్ రాయల్స్ టీం 7 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది.