RR vs LSG, ఐపీఎల్‌ 2024: అదరగొట్టిన సంజూ శాంసన్.. ఆకట్టుకున్నరియాన్ పరాగ్.. లక్నో లక్ష్యం ఎంతంటే?

Rajasthan Royals vs Lucknow Super Giants: సంజూ శాంసన్ మరోసారి అదరగొట్టాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో తన జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆదివారం (మార్చి 24) సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో4 వికెట్ల నష్టానికి

RR vs LSG, ఐపీఎల్‌ 2024: అదరగొట్టిన సంజూ శాంసన్.. ఆకట్టుకున్నరియాన్ పరాగ్.. లక్నో లక్ష్యం ఎంతంటే?
Sanju Samson

Updated on: Mar 24, 2024 | 5:54 PM

Rajasthan Royals vs Lucknow Super Giants: సంజూ శాంసన్ మరోసారి అదరగొట్టాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో తన జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆదివారం (మార్చి 24) సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. కెప్టెన్‌ శాంసన్ ( 52 బంతుల్లో 82 నాటౌట్, 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ కొట్టాడు. ఆల్ రౌండర్ రియాన్‌ పరాగ్‌ ( 29 బంతుల్లో 43, ఒక ఫోర్, 3 సిక్స్ లు), ధ్రువ్‌ జురేల్ (12 బంతుల్లో 20 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. అంతకు ముందు ఓపెనర్లు జైస్వాల్‌ (24), బట్లర్‌ (11), హెట్మెయర్ (7) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక లక్నో బౌలర్లలో నవీనుల్‌ హక్‌ 2 వికెట్లు పడగొట్టగా.. మోహ్‌సిన్‌ ఖాన్‌, బిష్ణోయ్‌ చెరో వికెట్‌ తీశారు. \

శాంసన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్..

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు..

క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, దీపక్ హుడా, కెఎల్ రాహుల్ (కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్.

ఇంపాక్ట్ ప్లేయర్: దీపక్ హుడా, మయాంక్ యాదవ్, అమిత్ మిశ్రా, ప్రేరక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్.

రాజస్థాన్ రాయల్స్ జట్టు:

జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), ర్యాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, ధ్రువ్ జురెల్, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్.

ఇంపాక్ట్ ప్లేయర్: రోవ్‌మన్ పావెల్, నాంద్రే బెర్గర్, తనుష్ కొట్యాన్, శుభమ్ దూబే,   కుల్దీప్ సేన్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us