KKR vs RR: రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసిన కేకేఆర్‌! మ్యాచ్‌లో హైలెట్‌ అంటే ఇదే..!

ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ అద్భుత విజయం సాధించింది. తక్కువ స్కోర్‌కు పరిమితమైన ఆర్ఆర్ జట్టు, కేకేఆర్ బౌలర్ల అద్భుత ప్రదర్శనకు లొంగిపోయింది. కేకేఆర్ ఛేజింగ్‌ను క్వింటన్ డికాక్ 97 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో సులువుగా పూర్తి చేసింది.

KKR vs RR: రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసిన కేకేఆర్‌! మ్యాచ్‌లో హైలెట్‌ అంటే ఇదే..!
Kkr Vs Rr

Updated on: Mar 27, 2025 | 6:36 AM

ఐపీఎల్‌ 2025లో భాగంగా బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తలపడింది. ఈ మ్యాచ్‌లో అస్సాంలోని గౌహతీలో జరిగింది. ఇది రాజస్థాన్‌ రాయల్స్‌కు సెకండ్‌ హోం గ్రౌండ్‌. ఇప్పటికే సన్‌రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆర్‌ఆర్‌, బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌ చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన ఆర్‌ఆర్‌ బౌలింగ్‌లోనూ కేకేఆర్‌ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్‌ బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌ఆర్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 151 పరుగులు మాత్రమే చేసింది. పిచ్‌లో టర్న్‌, స్వింగ్‌ లభిస్తుండటంతో కేకేఆర్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

పిచ్‌ నుంచి బ్యాటింగ్‌కు అంతగా హెల్ప్‌ లేకపోయినా.. ఆర్‌ఆర్‌ బ్యాటర్లు అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, వారి ఎటాకింగ్‌ గేమ్‌ స్ట్రాటజీ అంతగా రిజల్ట్‌ ఇవ్వలేదు. ఓపెనర్‌ సంజు శాంసన్‌ 13, నితీష్‌ రాణా 8, వనిందు హసరంగా 4, శుభమ్‌ దూబే 9, హెట్‌మేయర్‌ 7 చాలా దారుణంగా విఫలం అయ్యారు. యశస్వి జైస్వాల్‌ 29, రియాన్‌ పరాగ్‌ 25, ధృవ్‌ జురెల్‌ 33లు పర్వాలేదనిపించారు కానీ, పెద్ద ఇన్నింగ్‌లు ఆడలేకపోయారు. చివర్లలో జోఫ్రా ఆర్చర్‌ ఓ రెండు భారీ సిక్సులతో అలరించాడు. మొత్తంగా ఆర్‌ఆర్‌ కేవలం 151 పరుగుల సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. సునీల్‌ నరైన్‌ స్థానంలో ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వచ్చిన మొయిన్‌ అలీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు.

కేకేఆర్‌ జట్టులో బౌలింగ్‌ వేసిన ప్రతి బౌలర్‌కు వికెట్‌ దక్కింది. వైభవ్‌ అరోరా, హర్షిత్‌ రాణా, మొయిన్‌ అలీ, వరుణ్‌ చక్రవర్తి రెండేసి వికెట్లు తీసుకున్నారు. స్పాన్సర్‌ జాన్సన్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు. ఇక 152 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్‌ 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 153 పరుగులు చేసి విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతుల్లో ఓటమిపాలైన కేకేఆర్‌, ఈ మ్యాచ్‌లో గెలిచి, ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందించింది. క్వింటన్ డికాక్‌ తో కలిసి మొయిన్ అలీ ఓపెనర్‌గా వచ్చాడు కానీ, పెద్దగా ఇంప్యాక్ట్‌ చూపించలేదు.12 బంతులు ఆడి 5 రన్స్‌ మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు.

తొలి మ్యాచ్‌లో దుమ్మురేపిన కెప్టెన్‌ అజింక్యా రహానె ఈ మ్యాచ్‌లో 18 రన్స్‌ మాత్రమే చేసి నిరాశపర్చాడు. కానీ, ఓపెనర్‌ డికాక్‌.. మాత్రం సింగిల్‌ హ్యాండ్‌తో ఈ ఛేజింగ్‌ స్కోర్‌ సాధించి పెట్టాడు. 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 97 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. డికాక్‌తో కలిసి రఘువంశీ 17 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో డికాక్‌ ఆడిన ఇన్నింగ్స్‌ హైలెట్‌గా చెప్పుకోవచ్చు. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీపై దారుణంగా విఫలమైన డికాక్‌, ఈ మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చూపించాడు. కొద్దిలో సెంచరీ మిస్‌ అయ్యాడు కానీ, ఛేజింగ్‌కు మరికొన్ని రన్స్‌ ఉంటే సెంచరీ కూడా పూర్తి చేసుకునేవాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.