IPL 2025: రాజస్థాన్‌కు బీసీసీఐ బిగ్‌ షాక్… కెప్టెన్‌ శాంసన్‌కు రూ.24లక్షల జరిమానా!

గుజరాత్‌లో ఓటమి తర్వాత రాజస్థాన్ రాయల్స్‌ జట్టుకు మరోషాక్ తగిలింది. ఆ జ‌ట్టు కెప్టెన్ సంజూ శాంసన్ పై బీసీసీఐ ఫైన్ విధించింది. గుజ‌రాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ కు పాల్పడినందుకు కెప్టెన్ సంజూ శాంసన్‌కు రూ.24లక్షల ఫైన్ వేసింది.

IPL 2025: రాజస్థాన్‌కు బీసీసీఐ బిగ్‌ షాక్... కెప్టెన్‌ శాంసన్‌కు రూ.24లక్షల జరిమానా!
Sanju Samson

Updated on: Apr 10, 2025 | 11:58 AM

IPL 2025: గుజరాత్‌లో ఆడిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైన రాజస్థాన్ రాయల్స్‌కు బీసీసీఐ మరో షాక్ ఇచ్చింది. ఆ జ‌ట్టు కెప్టెన్ సంజూ శాంసన్ కు బీసీసీఐ ఫైన్ విధించింది. ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న అహ్మదాబాద్‌ వేదికగా గుజ‌రాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్  కారణంగా RR కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ రూ.24 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం, ఇది జట్టు యొక్క రెండవ ఓవర్ రేట్ నేరం కావడంతో సంజూ శాంసన్‌పై ఈ భారీ జరిమానా విధించారు. ఇంతకు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో స్లో ఓవ‌ర్ రేట్ కారణంగా ఆ మ్యాచ్‌కు కెప్టెన్‌గా ఉన్న రియాన్‌ పరాగ్‌కు బీసీసీఐ రూ.12లక్షల జరిమానా విధించింది. అయితే తాజాగా రెండోసారి కూడా ఇలాంటి పొర‌పాటే చేయ‌డంతో జట్టులోని మిగతా ఆటగాళ్లు, ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా, ప్రతి ఒక్కరికీ రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం ఏది తక్కువైతే అది జరిమానాగా విధించింది.

అయితే గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ 58 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 216 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్‌ ముందు 217 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రాయల్స్‌ తడబడింది. వరుస వికెట్లు కోల్పోవడంతో 159 పరుగులకే ఆలౌటైంది. టీమ్ ఓటమిపై కెప్టెన్ శాంసన్ స్పందించారు. గుజ‌రాత్ తో ఆరంభంలోనే త‌మ బౌల‌ర్లు ప్ర‌ణాళిక‌లకు త‌గిన‌ట్లుగా బౌలింగ్ చేశార‌ని సంజూ తెలిపాడు. అలాగే బ్యాటింగ్ లో కీల‌క‌ద‌శ‌లో తాము వికెట్లు కోల్పోవ‌డం కూడా మ్యాచ్‌ ఓటమి ఓ కారణం అని సంజూ అన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్‌ రెండింటిలో విజ‌యం సాధించి ప్రస్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..