RCB vs PBKS: చివర్లో తడబడిన బెంగళూరు.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?

Royal Challengers Bengaluru vs Punjab Kings, Final: ఐపీఎల్ 18వ సీజన్ చివరి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య అహ్మదాబాద్‌లో జరుగుతోంది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.

RCB vs PBKS: చివర్లో తడబడిన బెంగళూరు.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
Rcb Vs Pbks Score

Updated on: Jun 03, 2025 | 9:29 PM

ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) కు 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులు చేశాడు.

కోహ్లీ తప్ప మరెవరూ 30 పరుగుల మార్కును దాటలేకపోయారు. అయితే, జితేష్ వేగంగా బ్యాటింగ్ చేసి 10 బంతుల్లో 240 స్ట్రైక్ రేట్‌తో 24 పరుగులు చేశాడు. పంజాబ్ తరపున కైల్ జామిసన్ 3 వికెట్లు, అర్ష్‌దీప్ 3 వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్‌లో అర్ష్‌దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్ 18వ సీజన్ ఆడుతున్న ఈ రెండు జట్లు తమ తొలి టైటిల్ కోసం ఎదురు చూస్తున్నాయి. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్‌సిబి తొలిసారి ఫైనల్ ఆడుతోంది. మరోవైపు, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కూడా తొలిసారి టైటిల్ మ్యాచ్‌కు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ.

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, జేవియర్ బార్ట్‌లెట్, హర్‌ప్రీత్ బ్రార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us