IPL 2023: కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్సీ.. బెంగళూరు జట్టులో ‘ఊరమాస్ ప్లేయర్స్’.. షెడ్యూల్ ఇదే.!

|

Feb 17, 2023 | 9:25 PM

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గెలుపు ఈ సీజన్‌లో వస్తుందని ఆర్‌సీబీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‌లో ఎక్కువ మంది..

IPL 2023: కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్సీ.. బెంగళూరు జట్టులో ఊరమాస్ ప్లేయర్స్.. షెడ్యూల్ ఇదే.!
Royal Challengers Bangalore
Follow us on

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గెలుపు ఈ సీజన్‌లో వస్తుందని ఆర్‌సీబీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‌లో ఎక్కువ మంది అభిమానులు ఉన్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే చెప్పాలి.. ప్రతీసారి ఈ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ తమ టీం గెలుపొందాలని కోరుకుంటున్నప్పటికీ.. చివరికి నిరాశే మిగులుతోంది. అయినా ఆ ఫ్యాన్స్ ఇప్పటికీ ఆశ వదులుకోలేదు. ఈ ఏడాది కోహ్లీ భీకర ఫామ్, అటు డుప్లెసిస్ రెడ్ హాట్ ఫామ్‌, బిగ్ షో మ్యాక్సీ‌ను దృష్టిలో ఉంచుకుని.. మరోసారి ‘ఈ సాలా కప్ నమదే’ అంటూ నెట్టింట సందడి చేస్తున్నారు బెంగళూరు అభిమానులు. ఇక ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఆర్‌సీబీ సైతం తన సొంత మైదానం అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 4 ఏళ్ల తర్వాత మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్‌లో ఏప్రిల్ 2, 10, 15, 17, 23, 26, మే 21 అనగా 7 మ్యాచ్‌లు హోం గ్రౌండ్‌లో ఆర్‌సీబీ ఆడుతుంది. దాని షెడ్యూల్ ఇలా ఉంది..

  • షెడ్యూల్:

ఏప్రిల్ 2 – vs ముంబై ఇండియన్స్(H), ఏప్రిల్ 6 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(A), ఏప్రిల్ 10 – vs లక్నో సూపర్ జెయింట్స్(H), ఏప్రిల్ 15 – vs ఢిల్లీ క్యాపిటల్స్(H), ఏప్రిల్ 17 – vs చెన్నై సూపర్ కింగ్స్(H), ఏప్రిల్ 20 – vs పంజాబ్ కింగ్స్(A), ఏప్రిల్ 23 – vs రాజస్థాన్ రాయల్స్(H), ఏప్రిల్ 26 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(H), మే 1 – vs లక్నో సూపర్ జెయింట్స్(A), మే 6 – vs ఢిల్లీ క్యాపిటల్స్(A), మే 9 – vs ముంబై ఇండియన్స్(A), మే 14 – vs రాజస్థాన్ రాయల్స్(A), మే 18 – vs సన్‌రైజర్స్ హైదరాబాద్(A), మే 21 – vs గుజరాత్ టైటాన్స్(H)

*H – హోం మ్యాచ్‌లు – A – ఎవే మ్యాచ్‌లు..

  • ఫుల్ స్క్వాడ్:

ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ , మహిపాల్ లోమ్రోర్, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, విల్ జాక్స్, హిమాన్షు శర్మ, రీస్ టాప్లీ