
Rohit Sharma Video: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, అతని భార్య రితికా సజ్దేహ్ ఇటీవల ముంబైలో జరిగిన ‘సీఏటీ క్రికెట్ రేటింగ్స్ అవార్డుల’ వేడుకలో నవ్వుతూ, ఉల్లాసంగా గడిపిన ఓ క్షణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నవ్వు వెనుక ఉన్న కారణం మరెవరో కాదు.. భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని..!
ఈ అవార్డుల వేడుకలో స్టేజ్‌పై ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఈ సరదా సంఘటన జరిగింది. ఆ ఆర్టిస్ట్ ఇతర క్రికెటర్లతో పాటు, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వాయిస్‌ని కూడా అనుకరించి చూపించారు. ధోని వాయిస్, అతను మాట్లాడే విధానాన్ని అద్భుతంగా అనుకరించడంతో, అక్కడే కూర్చున్న రోహిత్ శర్మ, అతని పక్కనే ఉన్న భార్య రితిక సజ్దేహ్ ఒక్కసారిగా నవ్వు ఆపుకోలేకపోయారు.
మిమిక్రీ ఆర్టిస్ట్ ధోని వాయిస్ ప్రారంభించగానే రోహిత్ శర్మ కడుపు చెక్కలయ్యేలా నవ్వడం, ఆ నవ్వును ఆపుకోలేక వెనక్కి తిరిగి భార్య రితికను చూడటం, ఆమె కూడా ఆశ్చర్యంతో కూడిన నవ్వుతో స్పందించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. మాజీ కెప్టెన్, జట్టులో తన సహచరుడైన ధోనిని ఆర్టిస్ట్ చాలా సరిగ్గా అనుకరించడంతో, రోహిత్ స్పందన అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతోంది.
The way Rohit Sharma and Ritika bhabhi enjoying Ms Dhoni’s mimicry during the ceat awards event.😂❤️ pic.twitter.com/SHQnUPTut9
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 8, 2025
ఈ వేదికపై రోహిత్ శర్మకు 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నందుకుగానూ ప్రత్యేక పురస్కారం లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన రోహిత్.. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి నుంచి తమ జట్టు ఎలా కోలుకుంది, ఆ తర్వాత టీమ్ స్పిరిట్, ఐక్యతతో వరుసగా ఐసీసీ టైటిళ్లను (2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ) ఎలా సాధించింది అనే విషయాలను పంచుకున్నారు.
ఏది ఏమైనా, సీరియస్ ఈవెంట్ మధ్యలో ఎంఎస్ ధోని మిమిక్రీ కారణంగా రోహిత్ శర్మ, రితికా సజ్దేహ్ నవ్వులు పూయించిన ఈ సరదా క్షణం, క్రీడాకారుల వ్యక్తిగత బంధాలను, వారి మధ్య ఉన్న సరదా వాతావరణాన్ని అభిమానులకు చూపించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..