
భారత క్రికెట్‌లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతానికి కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. దీంతో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత దాదాపుగా ఆరు నెలల విరామం లభించనుంది. ఇక ఇప్పట్లో వన్డే సిరీస్‌లు లేకపోవడం.. భారత జట్టు తమ ఫోకస్ మొత్తం టీ20ల మీదనే ఉంచడంతో.. ఈ ఇద్దరు రెస్ట్ తీసుకోనున్నారు. కివీస్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో భారత్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. టీ20 ప్రపంచకప్ అనంతరం ఐపీఎల్ జరగనుంది. ఈ క్రమంలో, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను మళ్లీ ఐపీఎల్‌లోనే చూడగలం. అప్పటివరకు అభిమానులు వేచి ఉండక తప్పదు.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో
అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జూన్ లేదా జూలైలో మళ్లీ ఆడే అవకాశం ఉంది. జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం భారత్‌కు రానుంది. ఈ వన్డే సిరీస్ లో ‘రోకో’ ఆడే అవకాశాలున్నాయి. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌పై యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే మాత్రం, ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతారు. ఇంగ్లాండ్ గడ్డపై టీం ఇండియా వన్డే సిరీస్ ఆడనుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌లో అంత మజా ఉండకపోవచ్చని, ఇంగ్లాండ్‌తో సిరీస్‌తోనే అభిమానులకు కావాల్సినంత కిక్ లభిస్తుందని చర్చ జరుగుతోంది. ఇంగ్లాండ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీలకం అవుతారని అంచనాలు ఉన్నాయి. వారిద్దరిపైనే అందరి ఫోకస్ ఉంటుందని చెబుతున్నారు.
టీ20 ప్రపంచకప్ తర్వాత ఆడే ప్రతి వన్డే సిరీస్‌ను వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగానే టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దీంతో సీనియర్ల ఫిట్‌నెస్, ఫామ్ టీం ఇండియాకు కీలకమవుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిలకడగా రాణించారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టే బ్యాటింగ్ చేశారు. మరో ఆరు నెలల తర్వాత ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంగ్లాండ్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు 27 వన్డేల్లో బరిలోకి దిగి 1428 పరుగులు చేశాడు. అతని సగటు 64కు పైగా ఉంది. ఇంగ్లాండ్‌లో రోహిత్ శర్మ ఏడు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లీకి కూడా ఇంగ్లాండ్‌లో మంచి రికార్డే ఉంది. 33 వన్డేల్లో 1349 పరుగులు సాధించాడు. సగటు 51.88. ఇంగ్లాండ్‌లో విరాట్ కోహ్లీ ఒక సెంచరీ, 12 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్ తర్వాత భారత్ వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో న్యూజిలాండ్‌కు వెళ్లాల్సి ఉంది.
ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..