Rohit-Virat: రోకో ఫ్యాన్స్‌కు 18 ‘స్పెషల్ గిఫ్ట్స్’.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Rohit Sharma - Virat Kohli: వరల్డ్ కప్ 2027 కి ముందు భారత్ ఆడే వన్డేల సంఖ్య పరిమితంగా ఉన్నందున, ప్రతి మ్యాచ్ ఈ ఇద్దరు దిగ్గజాలకు ఎంతో ముఖ్యం. తమ ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే, మరోసారి ప్రపంచకప్‌లో వీరిద్దరి బ్యాటింగ్ విన్యాసాలను చూడటం అభిమానులకు కనువిందే..!

Rohit-Virat: రోకో ఫ్యాన్స్‌కు 18 స్పెషల్ గిఫ్ట్స్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
Rohit Sharma Virat Kohli

Updated on: Dec 31, 2025 | 8:37 AM

Rohit Sharma – Virat Kohli: భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ అద్భుతమైన ప్రదర్శనతో 2025 ఏడాదిని ఘనంగా ముగించారు. ఇప్పుడు అందరి దృష్టి 2026పై పడింది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు 2026లో ఎన్ని వన్డేలు ఆడే అవకాశం ఉంది? టీమ్ ఇండియా షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అన్న ఆసక్తికర వివరాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో అసలు రోకోలు 2026లో ఎన్ని మ్యాచ్ లు ఆడతారో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత క్రికెట్ చరిత్రలో ధృవతారల్లాంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం తమ కెరీర్‌లో కీలక దశలో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటికే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, కేవలం వన్డే (ODI) ఫార్మాట్‌పైనే దృష్టి కేంద్రీకరించారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్న వీరిద్దరికీ 2026 సంవత్సరం అత్యంత కీలకం కానుంది.

ఇది కూడా చదవండి: 21 ఫోర్లు, 10 సిక్సర్లు.. ప్రపంచ కప్‌ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. దిమ్మతిరిగే రికార్డ్ ఎవరిదంటే?

ఇవి కూడా చదవండి

2026లో టీమ్ ఇండియా వన్డే షెడ్యూల్..

2026 క్యాలెండర్ ఇయర్ లో భారత జట్టు మొత్తం 18 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లు ఆరు వేర్వేరు జట్లతో జరగనున్నాయి. రోహిత్, విరాట్ ఫిట్‌నెస్‌తో ఉంటే ఈ 18 మ్యాచ్‌లలోనూ ఆడే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

జనవరి 2026: స్వదేశంలో న్యూజిలాండ్ తో 3 వన్డేలు (జనవరి 11 నుంచి 18 వరకు).

జులై 2026: ఇంగ్లాండ్ పర్యటనలో 3 వన్డేలు (జులై 14 నుంచి 19 వరకు).

సెప్టెంబర్ 2026: బంగ్లాదేశ్ పర్యటన (షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది).

అక్టోబర్ 2026: స్వదేశంలో వెస్టిండీస్ తో 3 వన్డేలు.

అక్టోబర్-నవంబర్ 2026: న్యూజిలాండ్ పర్యటనలో 3 వన్డేలు.

డిసెంబర్ 2026: స్వదేశంలో శ్రీలంకతో 3 వన్డేలు.

2025లో వీరిద్దరి సంచలన ప్రదర్శన.. గత ఏడాది (2025) రోహిత్, విరాట్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచారు.

ఇది కూడా చదవండి: Video: W,W,W,W,W,W,W,W.. టీ20 క్రికెట్‌లోనే ఊహించని విధ్వంసం.. 7 పరుగులు, 8 వికెట్లతో డేంజరస్ బౌలింగ్..

విరాట్ కోహ్లీ: 13 వన్డేల్లో 65.1 సగటుతో 651 పరుగులు సాధించాడు. భారత్ గెలిచిన మ్యాచ్‌లలో 18,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.

రోహిత్ శర్మ: రోహిత్ సారథ్యంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అతను 14 వన్డేల్లో 50 సగటుతో పరుగులు చేయడమే కాకుండా, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన కొత్త రికార్డును నెలకొల్పాడు.

దేశవాళీ విజయ్ హజారే ట్రోఫీలో కూడా వీరిద్దరూ సెంచరీలు బాది తమ ఫిట్‌నెస్‌ను, పరుగుల ఆకలిని నిరూపించుకున్నారు.