Rohit Sharma: స్పిన్నర్‌గా హిట్​మ్యాన్ ఖాతాలో ఓ రికార్డు ఉంది…! మీకు తెలుసా..!

|

May 06, 2021 | 11:33 PM

On this day in 2009: ఇలా తన స్పిన్ మంత్రంతో చాలా రికార్డులు కూడా ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలో పలుసార్లు బౌలింగ్ చేసి అలరించినా ప్రస్తుతం బ్యాటింగ్​పై పూర్తి దృష్టి సారించి బౌలింగ్​కు దూరంగా...

Rohit Sharma: స్పిన్నర్‌గా హిట్​మ్యాన్ ఖాతాలో ఓ రికార్డు ఉంది...! మీకు తెలుసా..!
Follow us on

రోహిత్ శర్మ.. టీమ్ఇండియా స్టార్ ఓపెనర్… వన్డేల్లో ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా మూడు డబుల్ సెంచరీలు సాధించి హిట్​మ్యాన్​గా కూడా సొంత రికార్డులను క్రియేట్ చేసుకున్నాడు. అయితే రోహిత్​ మంచి స్పిన్నర్ కూడా.. ఈ సంగతి చాలా మందికి తెలియదు. ఇలా తన స్పిన్ మంత్రంతో చాలా రికార్డులు కూడా ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలో పలుసార్లు బౌలింగ్ చేసి అలరించినా ప్రస్తుతం బ్యాటింగ్​పై పూర్తి దృష్టి సారించి బౌలింగ్​కు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్​లో హ్యాట్రిక్ రికార్డు కూడా ఉంది. ఈ ఘనత సాధించింది సరిగ్గా ఏప్రిల్ 06నే…. ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో దక్కన్ ఛార్జర్స్​ తరఫున ఆడిన రోహిత్ బౌలింగ్​లో ఈ హ్యాట్రిక్ రికార్డును నమోదు చేసుకున్నాడు.

ఆ రోజు ఏం జరిగిదంటే…

ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్కన్ ఛార్జర్స్… నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శర్మ 38 పరుగులతో అలరించాడు. ఆ తర్వాత టార్గెట్  ఛేదనలో ముంబై ఇండియన్స్ 16 ఓవర్లు ముగిసే సమయానికి 103/4తో నిలిచింది. మరో నాలుగు ఓవర్లు మాత్రమే ఇన్నాయి.

ఇక్కడే తిప్పేశాడు…

అయితే.. 16వ ఓవర్‌ వేసిన రోహిత్ శర్మ చివరి రెండు బంతుల్లోనూ అభిషేక్ నాయర్ (1), హర్భజన్ సింగ్‌(0)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత 18వ ఓవర్ తొలి బంతికే జేపీ డుమినీ (52)ని పెవిలియన్ దారి పట్టించాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో దక్కన్ ఛార్జర్స్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్​లో 6 పరుగులకే నాలుగు వికెట్లు దక్కించుకుని తన కెరీర్​లో ఓ రికార్డును నమోదు చేసుకున్నాడు. విజయవంతమైన కెప్టెన్ 2008లో ప్రారంభమైన ఈ ఐపీఎల్‌లో దక్కన్ ఛార్జర్స్​కు తొలిసారిగా ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్​లో ఆ జట్టు తరఫున అత్యధికంగా 404 పరుగులు చేశాడు. తర్వాతి ఏడాది వైస్​ కెప్టెన్​గా పదోన్నతి పొందాడు. అదే సంవత్సరం జోహెన్స్​బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్​లో గెలిచి కప్పు సాధించిందీ జట్టు. ఏడాది తర్వాత  ముంబై ఇండియన్స్ రోహిత్ ను దక్కించుకుంది. 2013 సీజన్​ మధ్యలో రికీ పాంటింగ్​ను తప్పించి రోహిత్​కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్ గా తొలి సీజన్​లో  జట్టును విజేతగా నిలిపాడు. తర్వాత 2015, 2017, 2019, 2020లో ముంబై ఇండియన్స్ కి ట్రోఫీలు అందించి… క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్నాడు.

ఇవి కూడా చదవండి: Aadhar Card: ఆధార్ మిస్ యూజ్ అవుతుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్నారా? మీ కార్డును ఇలా లాక్ చేసుకోండి..

ఏపీ విద్యార్థుల‌కు జ‌గన్ స‌ర్కార్ గుడ్ న్యూస్.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్