
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టులో యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ ఎంపికయ్యాడు. భారత వన్డే జట్టులో తొలిసారిగా చేరాడు. యశస్వి జైస్వాల్ టెస్ట్, టీ20 ఇంటర్నేషనల్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు 50 ఓవర్ల క్రికెట్‌లోనూ ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. అయితే, జైస్వాల్ ఇంకా వన్డేలు ఆడలేకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే, ఈ ఆటగాడి ఎంపికను భారత కెప్టెన్ రోహిత్ శర్మ సమర్థించాడు. జైస్వాల్‌ని ఎందుకు ఎంపిక చేశారో చెప్పిన కారణాలు కూడా చూద్దాం..
ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయడంలో ఇది కూడా పెద్ద అంశం. రోహిత్, శుభ్‌మన్ గిల్‌లతో కలిసి రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. జైస్వాల్ ఎంపిక గురించి రోహిత్ మాట్లాడితే, ‘కొన్నిసార్లు నంబర్‌లను పట్టించుకోకుండా జైస్వాల్‌ను చూడటం చాలా కష్టమని నేను భావిస్తున్నాను. మేం జైస్వాల్‌ని గత ఆరు-ఎనిమిది నెలలుగా గమనించిన తర్వాత ఎంపిక చేశాం. అతను ఒక్క వన్డే కూడా ఆడలేదు. కానీ, అతనికి సామర్థ్యం ఉన్నందున అతను ఎంపికయ్యాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
జైస్వాల్ భారత్ తరపున ఇప్పటివరకు 19 టెస్టులు ఆడి 52.88 సగటుతో 1798 పరుగులు చేశాడు. అతను నాలుగు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు చేశాడు. అతను 23 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 36.15 సగటుతో 723 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో భారత్ తరపున అతను ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా, అతను ఈ రెండు ఫార్మాట్లలో భారత అగ్రశ్రేణి ఆటగాడిగా నిలిచాడు. మరి భారత జట్టు అతడిని ఇంగ్లండ్ సిరీస్‌లో ట్రై చేస్తుందా లేక నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగుతుందా అనేది చూడాలి.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా (ఇంగ్లండ్ సిరీస్‌కు మాత్రమే).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..