Rohit Sharma: తప్పు సరిదిద్దుకునే పనిలో రోహిత్‌ శర్మ! అక్షర్‌ పటేల్‌కు స్పెషల్‌ బంపర్‌ ఆఫర్‌

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా గురువారం టీమిండియా తమ తొలి మ్యాచ్‌ ఆడింది. దుబాయ్‌లోని ఇంటర్నేషనల్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను ఆరంభంలోనే టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు.

Rohit Sharma: తప్పు సరిదిద్దుకునే పనిలో రోహిత్‌ శర్మ! అక్షర్‌ పటేల్‌కు స్పెషల్‌ బంపర్‌ ఆఫర్‌
Rohit Sharma Axer Patel

Updated on: Feb 21, 2025 | 6:49 AM

నిన్నటి మ్యాచ్ లో కేవలం 35 పరుగులకే బంగ్లాదేశ్‌ 5 వికెట్లు కోల్పోయింది. ఇదే టైమ్‌లో ఆరో వికెట్‌ కూడా కోల్పోవాల్సింది. కానీ, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక సింపుల్‌ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అదే బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌కు ఊపిరిపోసింది. టీమిండియాను ఈ మ్యాచ్‌ గెలిచేందుకు కాస్త సీరియస్‌గా పోరాడేలా చేసింది. అయితే తాను చేసిన తప్పుకు రోహిత్‌ కూడా చాలా ఫీల్‌ అయ్యాడు. చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. మరి రోహిత్‌ చేసిన తప్పేంటి? అక్షర్‌ పటేల్‌కు ఇచ్చిన ఆ బంపర్‌ ఆఫర్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిన్న బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభమైన కొద్ది సేపటికే కుప్పకూలేలా కనిపించింది. షమీ వేసిన తొలి ఓవర్‌లో తొలి వికెట్‌, రాణా వేసిన రెండో వికెట్‌ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత షమీ బౌలింగ్‌లో స్లిప్‌లో గిల్‌ సూపర్‌ క్యాచ్‌తో మెహదీ హసన్‌ మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దీంతో బంగ్లాదేశ్‌ 6.2 ఓవర్లలో 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మ అక్షర్‌ పటేల్‌ను వెంటనే రంగంలోకి దింపాడు. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ వేసేందుకు వచ్చిన అక్షర్‌ పటేల్‌ రెండో బంతికే తాంజిద్‌ హసన్‌, మూడో బంతికి బంగ్లా మోస్ట్‌ సీనియర్‌ ప్లేయర్‌ ముష్ఫికర్‌ రహిమ్‌ను కూడా అవుట్‌ చేశాడు. ఈ రెండు కూడా కీపర్‌ క్యాచ్‌లే. రెండు క్యాచ్‌లను కేఎల్‌ రాహుల్‌ అద్బుతంగా అందుకున్నాడు.

హసన్‌ అవుట్‌ అనే విషయం అక్షర్‌కు కూడా తెలియదు. కానీ, క్యాచ్‌ పట్టిన కేఎల్‌ రాహుల్‌ ఒక్కడే అపీల్‌ చేయడంతో అంపైర్‌ అవుట్‌ ఇచ్చాడు. బాల్‌, బ్యాట్‌కు తగిలిన సౌండ్‌ తనకు రాలేదని అక్షర్‌ కనీసం అపీల్‌ కూడా చేయలేదు. ఏదైతేనేం.. రెండు బంతుల్లో రెండు వికెట్ల రావడంతో అక్షర్‌ పటేల్‌కు హాట్రిక్‌ అందుకునే అవకాశం వచ్చింది. వెంటనే కెప్టెన్‌ రోహిత్‌ స్లిప్‌లో ముగ్గురిని పెట్టాడు. ఫస్ట్‌ స్లిప్‌ ఫీల్డర్‌ పోజిషన్‌లో తనే ఉన్నాడు. బ్యాటింగ్‌కు వచ్చిన జెకర్‌ అలీకి సూపర్‌ డెలవరీ వేశాడు. అనుకున్నట్లే బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకున్న బాల్‌ ఫస్ట్‌ స్లిప్‌లోకి వెళ్లింది. రోహిత్‌ చేతుల్లో పడింది.. దీంతో అక్షర్‌కు హ్యాట్రిక్‌ వచ్చిందని మిగతా ప్లేయర్లు సెలబ్రేషన్‌ కూడా మొదలెట్టారు. కానీ, రోహిత్‌ కంగారులో క్యాచ్‌ను జారవిరిచాడు. అక్షర్‌ పటేల్‌ హ్యాట్రిక్‌ సాధించే అవకాశం కోల్పోయాడు.

ఒక వేళ రోహిత్‌ కనుక ఆ క్యాచ్‌ పట్టి ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్‌ సాధించిన తొలి బౌలర్‌గా అక్షర్‌ పటేల్‌ పేరు చరిత్రలో నిలిచిపోయేది. అలాగే అక్షర్‌ కెరీర్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదు అయ్యేది. ఓ బౌలర్‌ జీవితంలో హ్యాట్రిక్‌ ఎంత విలువైందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. క్యాచ్‌ వదిలేసినందుకు గ్రౌండ్‌లోనే రోహిత్‌ చాలా ఫ్రస్టేట్‌ అయ్యాడు. తన చేయిని గ్రౌండ్‌కేసి బాదుకున్నాడు. ఆ తర్వాత అక్షర్‌కు సారీ కూడా చెప్పాడు. అయినా కూడా రోహిత్‌కు తాను చేసిన తప్పు ఇంకా వెంటాడుతూనే ఉన్నట్లుంది. అందుకే మ్యాచ్‌ తర్వాత అక్షర్‌ను డిన్నర్‌కు తీసుకెళ్తా అంటూ తెలిపాడు. ఇక టీమిండియా కెప్టెన్‌, గొప్ప ఆటగాడు రోహిత్‌ శర్మ డిన్నర్‌కి పిలవడంతో తన హ్యాట్రిక్‌ మిస్‌ అయిన బాధ అక్షర్‌కు కొంచెమైనా తగ్గుతుందేమో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..