Rohit Sharma: శ్రీలంకపై విజయంతో రికార్డు సృష్టంచిన రోహిత్ శర్మ.. అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా గుర్తింపు..

|

Feb 25, 2022 | 8:48 AM

టీమిండియా కొత్త రథసారథి రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీ పరంగా అతడు ఈ ఘనత సాధించాడు..

Rohit Sharma: శ్రీలంకపై విజయంతో రికార్డు సృష్టంచిన రోహిత్ శర్మ.. అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా గుర్తింపు..
Rohith
Follow us on

టీమిండియా కొత్త రథసారథి రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీ పరంగా అతడు ఈ ఘనత సాధించాడు. లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో విజయం సాధించి.. రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు. తొలి టీ20లో భారత్ 62 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ఇన్నింగ్స్ 137 పరుగులకే ముగిసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు ఏంటని ఆలోచిస్తున్నారా… స్వదేశంలో T20లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. లక్నోలో శ్రీలంకతో జరిగిన తొలి టీ20 స్వదేశంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడిన 16వ టీ20. ఈ 16 టీ20ల్లో భారత్ 15 విజయాలు సాధించగా, ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. అంటే లక్నోలో శ్రీలంకపై విజయం 15వ విజయం అన్న మాట.

రోహిత్ శర్మ మాదిరిగానే, ఇంగ్లండ్ కెప్టెన్ ఓన్ మోర్గాన్, కేన్ విలియమ్సన్ కూడా వారి స్వంత గడ్డపై 15 విజయాలు సాధించారు. కానీ రోహిత్ కంటే వారు ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. మోర్గాన్ 25 మ్యాచ్‌ల్లో 15 విజయాలు నమోదు చేశాడు. విలియమ్సన్ 30 మ్యాచ్‌ల్లో 15 విజయాలు సాధించాడు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. న్యూజిలాండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్టిల్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కునెట్టిన రోహిత్ శర్మ.. శ్రీలంక మ్యాచులో అత్యధిక పరుగుల రికార్డును సాధించాడు. రోహిత్ ప్రస్తుతం 123 మ్యాచ్‌లలో 115 ఇన్నింగ్స్‌లలో 33 సగటు, 140 స్ట్రైక్ రేట్‌తో 3307 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల రేసులో, రోహిత్, గప్టిల్, కోహ్లీ మధ్య రేసు కొనసాగుతుంది. ముగ్గురి మధ్య పెద్దగా తేడా లేదు. 108 ఇన్నింగ్స్‌లలో 3299 పరుగులు చేసిన రోహిత్ తర్వాత గప్టిల్ రెండవ స్థానంలో ఉన్నాడు.

Read also.. IND vs SL: తగ్గేదే లే అంటున్న రవీంద్ర జడేజా.. లైవ్‌ మ్యాచ్‌లో పుష్ప సీన్ చూపించిన ఆల్‌రౌండర్..