టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం మరో ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 3000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 18 పరుగుల దూరంలో ఉన్న రోహిత్ నమీబియా రూబెన్ ట్రంపెల్‌మన్ బౌలింగ్‌లో బౌండరీతో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 3227 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. మార్టిన్ గప్టిల్ 2వ స్థానంలో నిలిచాడు.
విరాట్ కోహ్లీ 91 మ్యాచ్‌ల్లో 3,216 పరుగులు చేశాడు. మార్టిన్ గుప్టిల్ 107 మ్యాచ్‌ల్లో 3.115 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 116 మ్యాచ్‌ల్లో 3000 పరుగులు మైలురాయిని సాధించాడు. రోహిత్ ఈ మ్యాచ్‌లో 37 బంతుల్లో 56(7 ఫోర్లు, 2 సిక్స్‌లు)పరుగులు చేశాడు. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో అతని స్థానంలో రోహిత్ శర్మ ఎంపిక చేసే అవకాశలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
?
Rohit Sharma, take a bow ?♂️#T20WorldCup | #INDvNAM | https://t.co/58OdXxLvhf pic.twitter.com/dBYgDEEgry
— ICC (@ICC) November 8, 2021
Read Also.. T20 World Cup 2021: పాకిస్తాన్‌కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన వసీం జాఫర్.. 12-1లో అర్థం ఏమిటంటే..