
Yuvraj Singh Comments on Rohit Sharma: భారత జట్టు వన్డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ కోల్పోయిన ఫామ్‌ను తిరిగి పొందాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతను అద్భుతమైన సెంచరీ సాధించాడు. అదే సమయంలో, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘హిట్‌మ్యాన్’ పాత శైలి కనిపించింది. కానీ, రోహిత్ ఈ టోర్నమెంట్‌లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించగలడా లేదా అనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రోహిత్ గురించి ఒక భారీ అంచనా వేశాడు. రోహిత్ తన లయలో ఉంటే, అతను 60 బంతుల్లో కూడా సెంచరీ చేయగలడంటూ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్‌పై రోహిత్ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తుందని భారత అభిమానులందరూ ఆశిస్తున్నారు. అయితే, పాకిస్తాన్ జట్టులో షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, నసీమ్ షా వంటి ప్రమాదకరమైన బౌలర్లు ఉన్నందున రోహిత్ భారీ స్కోరు చేయడం అంత సులభం కాదు.
జియో హాట్‌స్టార్ షోలో రోహిత్ శర్మ గురించి యువరాజ్ మాట్లాడుతూ, ‘అతను ఫామ్‌లో ఉంటే, 60 బంతుల్లో సెంచరీ చేయగలడు. ఇది అతని ప్రత్యేకత. రోహిత్ కేవలం ఫోర్లు కొట్టడమే కాదు, సిక్సర్లు కూడా కొట్టి బంతిని స్టాండ్స్‌లోకి పంపుతాడు. అతను షార్ట్ బాల్‌ను అద్భుతంగా ఆడే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. ఎవరైనా 145-150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసినా, రోహిత్ దానిని సులభంగా హుక్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాడు. అతని స్ట్రైక్ రేట్ ఎప్పుడూ 120-140 మధ్య ఉంటుంది. అతని రోజున ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
Yuvraj Singh said – “If Rohit Sharma is in form, he will score a Century in 60 balls in ODIs, that is his Quality. Once he gets going, it’s just about fours but also hitting Sixes with so much ease. Even if someone bowls at 145-150 kmph, Rohit has the ability to hook it… pic.twitter.com/EeiQKM3UP6
— Tanuj Singh (@ImTanujSingh) February 22, 2025
“రోహిత్, విరాట్ ఫామ్ ఏదైనా, వారు ఎల్లప్పుడూ జట్టుకు అతిపెద్ద మ్యాచ్ విన్నర్లుగా ఉంటారు. నేను ఎల్లప్పుడూ నా మ్యాచ్ విన్నర్లకు మద్దతు ఇస్తాను. వన్డే క్రికెట్‌లో, ముఖ్యంగా వైట్-బాల్ ఫార్మాట్‌లో, విరాట్ కోహ్లీతో పాటు బ్యాట్స్‌మన్‌గా అతను భారతదేశానికి అతిపెద్ద మ్యాచ్ విన్నర్. రోహిత్ ఇబ్బంది పడుతున్నప్పటికీ పరుగులు సాధిస్తే, అది ప్రత్యర్థి జట్టుకు ప్రమాదకరం’ అని యువరాజ్ తెలిపాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..