Captain Rohit Sharma: త్వరలో న్యూజిలాండ్‌తో జరుగనున్న సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ నుంచే భారత పురుషుల క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ ను ఎంపిక చేసింది బీసీసీఐ. అలాగే వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించారు. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేయగా.. ఈ సిరీస్‌తో ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. నవంబర్ 17, 2021 నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా 3 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
ఇదిలాఉంటే.. ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్‌లకు వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను.. కోహ్లీ స్థానంలో కెప్టెన్‌గా నియమించడంతో రోహిత్ అభిమానుల్లో సంతోషం పొంగి పొర్లుతుంది. రోహిత్‌కు కెప్టెన్సీ రావడంపై తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో పోస్టులు పెడుతున్నారు. ఫన్నీ మీమ్స్, వీడియోలు, ఫోటోలతో హంగామా చేస్తున్నారు. మొత్తానికి రోహిత్‌కు కెప్టెన్సీ దక్కిందంటూ ఖుషీ అయిపోతున్నారు. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ‘మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది’, ‘వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోపీ, టీ20 వరల్డ్ కప్ అన్నీ తీసుకొచ్చేయ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొందరు రోహిత్ శర్మ డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. రోహిత్‌ను కెప్టెన్ గా ప్రకటించిన తరువాత అభిమానుల పరిస్థితి ఇదీ అంటూ పేర్కొన్నారు.
కాగా, టీ20 ప్రకంచకప్ సిరీస్ నుంచి భారత్ వైదొలిగిన తరువాత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీని వదులుకున్నాడు. దీంతో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. హిట్‌మాన్‌గా అభిమానులచే గుర్తింపు పొందిన రోహిత్ శర్మను.. టీ20 ఫార్మాట్‌లో ఉత్తమ కెప్టెన్‌గా పేర్కొంటారు. కారణం.. అతని సారథ్యంలోనే ముంబై ఇండియన్స్ టీమ్ 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించనుండటం, రాహుల్ ద్రావిడ్ కూడా కోచ్‌గా నియామకం అవడంతో వారిపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
న్యూజిలాండ్‌తో తలపడబోయే ఇండియా టీమ్ ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్.
Finally Rohit Sharma became team India captain. ❤❤
Congrats @ImRo45#RohitSharma #Hitman #INDvNZ #TeamIndia #indiancricket #ind #ICCT20WorldCup2021 #T20WorldCup pic.twitter.com/G7geS4OaU9
— Cricket Updates (@Cricket10496031) November 9, 2021
Rohit Sharma appointed New T20 captain of Team India*#RohitSharma pic.twitter.com/ikCO0V57YF
— ꜱʜᴜʙʜ (@ShubhS4082) November 9, 2021
#Rohitsharma is the new T20I captain…
Rohit & fans be like:- pic.twitter.com/mnSXKpur89— Na.samajh (@itsjust_shivam) November 9, 2021
#RohitSharma is named as the T20I Captain for #India in upcoming home series against NZ ??
All the Best Captain Rohith & Team India. Make us proud as of always. @ImRo45 pic.twitter.com/w8SiIjjFJa
— Hanmanthu (@Hanmant32871577) November 9, 2021
Congratulations @ImRo45 #RohitSharma #valimai pic.twitter.com/qol7D6B4gz
— Thala ????????️⚔️ (@sanju_off) November 9, 2021
Also read:
Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్‌బాస్‌లో నా సపోర్ట్ అతనికే.. సోనూసూద్ వీడియో వైరల్..
Malala Marriage: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా వివాహం..సోషల్ మీడియాలో ప్రకటన!