IPL 2024: హార్దిక్ పాండ్యా కాదు.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్‌ శర్మ.. కారణమిదే

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ మళ్లీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. రాబోయే సీజన్‌లో హిట్‌ మ్యాన్‌ సారథ్యంలోనే ముంబై బరిలోకి దిగనుంది. అదేంటి ముంబై కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాను నియమించారు కదా? మళ్లీ రోహిత్‌ శర్మ ఎందుకు అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళదాం రండి

IPL 2024: హార్దిక్ పాండ్యా కాదు.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్‌ శర్మ.. కారణమిదే
Hardik Pandya, Rohit Sharma

Updated on: Dec 23, 2023 | 3:08 PM

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ మళ్లీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. రాబోయే సీజన్‌లో హిట్‌ మ్యాన్‌ సారథ్యంలోనే ముంబై బరిలోకి దిగనుంది. అదేంటి ముంబై కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాను నియమించారు కదా? మళ్లీ రోహిత్‌ శర్మ ఎందుకు అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళదాం రండి. హిట్‌ మ్యాన్‌ కేవలం తాత్కాలిక కెప్టెన్‌ మాత్రమే. స్టాండింగ్‌ కెప్టెన్‌గా మాత్రమే ముంబై జట్టు బాధ్యతలు స్వీకరించనున్నాడు. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ కప్‌లో గాయపడిన హార్దిక్‌ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని తెలుస్తోంది. అతని చీలమండ గాయం చాలా తీవ్రంగా ఉందని ఐపీఎల్‌ ప్రారంభానికి పాండ్యా ఫూర్తి ఫిట్‌గా ఉండడం అనుమానమేనని సమాచారం. అందుకే ముందు జాగ్రత్తగా హార్దిక్‌ స్థానంలో రోహిత్‌ శర్మనే స్టాండింగ్‌ కెప్టెన్‌గా నియమించవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అటు హార్దిక్‌ కానీ, ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే గాయం కారణంగా హార్దిక్ పాండ్యా చాలా కాలం పాటు క్రికెట్‌కు దూరంగానే ఉండనున్నాడట. జనవరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే T-20 సిరీస్‌తో పాటు, ఐపీఎల్‌ 2024లోనూ పాండ్యా ఆడకపోవచ్చు. అంటే హార్దిక్ తిరిగి రావడానికి 2-3 నెలలు పట్టవచ్చు. అంటే డైరెక్టుగా T20 ప్రపంచ కప్‌లోనే హార్దిక్‌ బరిలోకి దిగనున్నాడు.

ODI ప్రపంచ కప్ 2023లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బంతిని ఆపే సమయంలో అతని కాలికి తీవ్రగాయమైంది. దీంతో వరల్డ్‌ కప్‌ టోర్నీ మధ్యలోనే బయటకు వచ్చేశాడు. అప్పటి నుంచి ఆటకు దూరంగానే ఉన్నాడీ స్టార్‌ ఆల్‌రౌండర్‌. ఐపీఎల్‌ ఆడతాడని ఆ మధ్యన వార్తలు వచ్చినా ఇప్పుడు అది కూడా కష్టంగా కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యాను ఇటీవల ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించింది. IPL 2024కి ముందు జరిగిన రిటెన్షన్‌ ప్రక్రియలో హార్దిక్ గుజరాత్ టైటాన్స్‌ను వీడి ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఆ వెంటనే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తొలగించి హార్దిక్‌కు సారథ్య బాధ్యతలు కట్ట బెట్టింది. అయితే అతను ఇప్పుడే ఏకంగా టోర్నీకే దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రోహిత్‌కే మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని ముంబై భావిస్తోంది. మరి ఇందుకు హిట్‌ మ్యాన్‌ అంగీకరిస్తాడా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

భార్యతో రోహిత్ శర్మ..

 

IPL 2024 కోసం ముంబై ఇండియన్స్:

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రూయిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నెహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్. చావ్లా, ఆకాష్ మధ్వల్, జాసన్ బెహ్రెండోర్ఫ్, హార్దిక్ పాండ్యా, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షన్ మధుశంక, శ్రేయాస్ గోపాల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, నువాన్ తుషార, మహ్మద్ నబీ, శివలిక్ శర్మ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..