Rohit Sharma Retirement: రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్‌ శర్మ

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయం తర్వాత టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్‌ శర్మ.. తాజాగా మరో అంతర్జాతీయ ఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఐపీఎల్‌ 2025తో ప్రస్తుతం బిజీగా ఉన్న రోహిత్‌.. ఐపీఎల్‌ తర్వాత ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు జట్టు ఎంపిక సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Rohit Sharma Retirement: రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్‌ శర్మ
Rohit Sharma

Updated on: May 07, 2025 | 7:51 PM

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయం తర్వాత టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్‌ శర్మ.. తాజాగా అంతర్జాతీయ టెస్ట్‌ ఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఐపీఎల్‌ 2025తో ప్రస్తుతం బిజీగా ఉన్న రోహిత్‌.. ఐపీఎల్‌ తర్వాత ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు జట్టు ఎంపిక సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఛాంపియన్స్‌ ట్రోఫీ కంటే ముందు రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో జరిగిన సిరీస్‌ను కూడా భారత్ 0-3 తేడాతో కోల్పోయింది.

రోహిత్ 67 టెస్టుల్లో సగటున 40.57 సాధించాడు. విదేశాల్లో టెస్టుల్లో రోహిత్‌ యావరేజ్‌ 31.01కి పడిపోయింది. ఆస్ట్రేలియాలో అతని సగటు 24.38, దక్షిణాఫ్రికాలో 16.63 కానీ, కానీ, ఇంగ్లాండ్‌లో మాత్రం 44.66కి మంచి యావరేజ్‌ కలిగి ఉన్నాడు. కాకుంటే ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ కంటే ముందే రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కాగా, మే 6న జట్టులో రోహిత్ భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా నిర్ణయం సెలెక్టర్లే ​​తీసుకుంటారని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించిన విషయం తెలిసిందే. కెప్టెన్సీ నుంచి తప్పిస్తామని సెలెక్టర్లు చెప్పడంతో.. ఇక పూర్తి టెస్ట్‌ ఫార్మాట్‌కే దూరం అవ్వాలని రోహిత్‌ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.