
ఈ ఏడాది జూలైలో బీసీసీఐ చెర్మైన్ పదవి నుంచి రోజర్ బిన్నీ తప్పుకోనున్నారు. BCCI రూల్స్ ప్రకారం.. 70ఏళ్లు నిండిన తర్వాత ఆఫీసు బేరర్లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలై 19తో బిన్నీ70 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ క్రమంలో రోజర్ తనంతట తానే అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
అతని స్థానంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా బోర్డు తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయంపై బోర్డులో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడిగా ఉన్న రోజర్ బిన్నీ.. 2022లో సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. కొత్త అధ్యక్షుడి ఎన్నికకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..