Yuzvendra Chahal : చాహల్‌కు షాక్ ఇచ్చిన ఆర్జే మహ్వాష్.. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే..

Yuzvendra Chahal : టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ కంటెంట్ క్రియేటర్ ఆర్‌జే మహ్వాష్ మధ్య ఏదో జరిగిందంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో నెటిజన్లు రకరకాలుగా ఊహించుకున్నారు.

Yuzvendra Chahal : చాహల్‌కు షాక్ ఇచ్చిన ఆర్జే మహ్వాష్.. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే..
Yuzvendra Chahal

Updated on: May 18, 2026 | 12:46 PM

Yuzvendra Chahal : టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ కంటెంట్ క్రియేటర్ ఆర్‌జే మహ్వాష్ మధ్య ఏదో జరిగిందంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో నెటిజన్లు రకరకాలుగా ఊహించుకున్నారు. తాజాగా ఈ రూమర్లపై మహ్వాష్ స్పందించారు. కేవలం ఒక చిన్న మనస్పర్థ కారణంగానే ఇలా జరిగిందని, దానిని నెటిజన్లు మరీ భూతద్దంలో పెట్టి చూస్తున్నారని ఆమె క్లారిటీ ఇచ్చారు.

చిన్న గొడవకే అంత రచ్చా?

పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహ్వాష్ మాట్లాడుతూ.. “జనాలకు ప్రతి చిన్న విషయాన్ని రచ్చ చేయడం అలవాటైపోయింది. స్నేహితుల మధ్య చిన్నపాటి విభేదాలు రావడం చాలా సహజం. ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం లేదా కాసేపు దూరంగా ఉండటం అనేది డిజిటల్ యుగంలో పెద్ద విషయం కాదు. అంత మాత్రానికే మా మధ్య ఏదో పెద్ద యుద్ధం జరిగిందని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు” అని అసహనం వ్యక్తం చేశారు. నిజమైన బంధాలు సోషల్ మీడియా అన్‌ఫాలోల వల్ల మారిపోవని ఆమె స్పష్టం చేశారు.

చాహల్ కష్టకాలంలో తోడుగా ఉన్నాం

గతంలో చాహల్ తన మానసిక స్థితి గురించి, ఆత్మహత్య ఆలోచనల గురించి పంచుకున్న విషయాలను మహ్వాష్ గుర్తు చేశారు. ఆ క్లిష్ట సమయంలో ఒక స్నేహితురాలిగా తను బాధ్యతగా పక్కన నిలబడ్డానని చెప్పారు. “చాహల్ తన పాడ్‌కాస్ట్‌లో చెప్పినట్లుగా అతను చాలా మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో తన ఫ్రెండ్స్ అందరం కలిసి అతనికి తోడుగా ఉన్నాం. అది మా బాధ్యత. కేవలం స్నేహం, విశ్వసనీయతతోనే నేను అతనికి మద్దతు ఇచ్చాను” అని మహ్వాష్ చెప్పుకొచ్చారు.

ఐపీఎల్‌లో చాహల్ హవా

ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచుల్లో 10 వికెట్లు తీశారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా (231 వికెట్లు) తన రికార్డును మరింత సుస్థిరం చేసుకున్నారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ, అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం రాలేదు. ప్రస్తుతం తన ఆటపైనే దృష్టి సారించిన చాహల్, వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో వచ్చే వార్తలను పట్టించుకోవడం లేదు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us