Video: అస్సాం కుర్రోడి ఓవర్ స్మార్ట్ బౌలింగ్.. కట్ చేస్తే.. టీమిండియాకి భారీ పనిష్మెంట్

|

Oct 10, 2024 | 9:32 PM

Riyan Parag Bowling Action Controversy: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ బౌలింగ్ యాక్షన్‌పై దుమారం రేగింది. అతని కొత్త బౌలింగ్ యాక్షన్ చూసి క్రికెట్ ప్రపంచం కూడా ఆశ్చర్యపోతోంది. అయితే, అతని కొత్త చర్య మొత్తం జట్టుకు తీవ్ర నష్టం కలిగించింది. మ్యాచ్ మధ్యలో అంపైర్ మొత్తం జట్టును శిక్షించాడు. ఢిల్లీలో జరిగిన రెండో మ్యాచ్‌లో పరాగ్ స్లింగ్ బౌలింగ్ యాక్షన్‌కు ప్రయత్నించాడు.

Video: అస్సాం కుర్రోడి ఓవర్ స్మార్ట్ బౌలింగ్.. కట్ చేస్తే.. టీమిండియాకి భారీ పనిష్మెంట్
Riyan Parag Bowling Action
Follow us on

Riyan Parag Bowling Action Controversy: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ బౌలింగ్ యాక్షన్‌పై దుమారం రేగింది. అతని కొత్త బౌలింగ్ యాక్షన్ చూసి క్రికెట్ ప్రపంచం కూడా ఆశ్చర్యపోతోంది. అయితే, అతని కొత్త చర్య మొత్తం జట్టుకు తీవ్ర నష్టం కలిగించింది. మ్యాచ్ మధ్యలో అంపైర్ మొత్తం జట్టును శిక్షించాడు. ఢిల్లీలో జరిగిన రెండో మ్యాచ్‌లో పరాగ్ స్లింగ్ బౌలింగ్ యాక్షన్‌కు ప్రయత్నించాడు. కానీ, అతని ప్రణాళిక ఫలించలేదు. దీంతో అంపైర్ అరుదైన నో-బాల్ ఇచ్చి జట్టు మొత్తాన్ని శిక్షించాడు.

ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో, భారత కెప్టెన్ ఏడుగురు బౌలర్లను ఉపయోగించాడు. అందులో రియాన్ పరాగ్ కూడా ఒకడు. ఈ మ్యాచ్‌లో మొత్తం ఏడుగురు భారత బౌలర్లు వికెట్లు తీశారు. ఏ ఫార్మాట్‌లోనైనా అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టు ఇలా చేయడం ఇదే తొలిసారి. పరాగ్ రెండు ఓవర్లలో 16 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

కేదార్ జాదవ్ యాక్షన్‌ను ప్రయత్నించిన పరాగ్..

పరాగ్ యాక్షన్ కేదార్ జాదవ్ లాగా ఉంది. కానీ, పరాగ్ ఈ యాక్షన్‌ను సరిగ్గా అమలు చేయడంలో విఫలమయ్యాడు. 22 ఏళ్ల పరాగ్ తన తొలి ఓవర్‌లో క్రీజు వెడల్పును సరిగ్గా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అతను అంపైర్ చేయి వెనుక నుంచి స్లింగ్ యాక్షన్‌తో బంతిని మహ్మదుల్లాకు బౌల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతని ఎత్తుగడ బెడిసికొట్టింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ బంతిని కొట్టడం మిస్ అయ్యాడు. అయితే, అంపైర్ మాత్రం భారత ఆల్ రౌండర్‌ను శిక్షించడంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

అంపైర్, లెగ్ అంపైర్‌తో మాట్లాడిన తర్వాత, నో బాల్‌ను చెక్ చేసేందుకు థర్డ్ అంపైర్‌కు పంపారు. అక్కడ పరాగ్ రూల్ 21.5ను ఉల్లంఘించాడని థర్డ్ అంపైర్ స్పష్టం చేశాడు. దీని ప్రకారం బంతిని విసిరేటప్పుడు బౌలర్ బ్యాక్ ఫుట్ లోపలికి వచ్చి తిరిగి వెళ్లాలి. క్రీజును తాకకూడదు. రియాన్ బౌలింగ్ చేసినప్పుడు, అతని బ్యాక్ ఫుట్ రిటర్న్ క్రీజుకు దగ్గరగా కూడా లేదు. అతని చేతి నుంచి బంతిని వదులుతున్నప్పుడు, అతని వెనుక పాదం గడ్డిపై ఉంది. దీంతో అది నో బాల్‌గా ప్రకటించడంతో బంగ్లాదేశ్‌కు ఫ్రీ హిట్‌ లభించింది. అయితే, మహ్మదుల్లా ఫ్రీ హిట్‌ను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సింగిల్ మాత్రమే తీయగలిగాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..