Rishabh Pant : నెట్స్‌లో పంత్‌కు కోచింగ్ స్టాఫ్ పరీక్ష.. ఆరు బంతుల్లో 15 రన్స్ టార్గెట్.. పంత్ రియాక్షన్ ఇదీ

Rishabh Pant : ఐపీఎల్ 2026 కు ముందు లఖ్‌నవూ కెప్టెన్ రిషభ్ పంత్ నెట్స్‌లో 6 బంతుల్లో 15 పరుగుల ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. తనదైన సిక్సర్లతో పంత్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్నాడు.బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్‌లో కూడా పంత్ చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు.

Rishabh Pant : నెట్స్‌లో పంత్‌కు కోచింగ్ స్టాఫ్ పరీక్ష.. ఆరు బంతుల్లో 15 రన్స్ టార్గెట్.. పంత్ రియాక్షన్ ఇదీ
Rishabh Pant

Updated on: Mar 22, 2026 | 7:45 PM

Rishabh Pant : ఐపీఎల్ 2026 ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. ఈసారి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు సారథ్యం వహిస్తున్న టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మైదానంలో చెమటోడుస్తున్నాడు. తనదైన శైలిలో సిక్సర్ల వర్షం కురిపించే పంత్, నెట్స్‌లో ఒక ఆసక్తికరమైన ఛాలెంజ్‌ను స్వీకరించాడు. కేవలం 6 బంతుల్లో 15 పరుగులు చేయాలనే ఈ కఠినమైన సవాల్‌ను పంత్ ఎలా ఎదుర్కొన్నాడు? కోచింగ్ స్టాఫ్ విసిరిన ఈ ఛాలెంజ్‌లో పంత్ గెలిచాడా లేదా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఐపీఎల్ 2026 సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు కఠినంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ రిషభ్ పంత్ తన మునుపటి ఫామ్‌ను కొనసాగించేందుకు ప్రాక్టీస్ సెషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో కోచింగ్ బృందం పంత్‌కు ఒక స్పెషల్ ఛాలెంజ్ ఇచ్చింది. చివరి ఓవర్‌లో 15 పరుగులు కావాల్సిన పరిస్థితి ఎదురైతే ఎలా ఆడతావో చూపించమని సవాల్ విసిరారు. పంత్ ఏమాత్రం తడుముకోకుండా క్రీజులోకి వెళ్లి తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించాడు.

ఈ ఛాలెంజ్‌లో భాగంగా రిషభ్ పంత్ ఎదుర్కొన్న మొదటి బంతిని బౌండరీ దాటించాడు. రెండు మూడు బాల్స్ సింగిల్ తీశాడు. తర్వాత ట్రేడ్ మార్క్ షాట్ తో బంతిని గాల్లోకి పంపి ఫోర్ లైన్ దాటించాడు. ఐదో బంతికి బాల్ తో పాటు బ్యాట్ కూడా జారిపోయి ఫోర్ వచ్చింది..తర్వాత 5వ బాల్ కూడా ఫోర్ కొట్టాడు. కోచ్‌లు నిర్దేశించిన 15 పరుగుల లక్ష్యాన్ని పంత్ చాలా ఈజీగానే చేరుకున్నాడు. ఇక లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి వాళ్లు నిర్ణయించిన టార్గెట్ కంటే కూడా 5 పరుగులు ఎక్కువగానే సాధించాడు. ఈ ప్రాక్టీస్ డ్రిల్ వీడియో చూస్తుంటే పంత్ చాలా ఫిట్‌గా ఉండటమే కాకుండా, తన పాత దూకుడును ఏమాత్రం కోల్పోలేదని స్పష్టమవుతోంది.

ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తప్పుకుని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌లో చేరిన పంత్, ఈసారి ఆ జట్టును ఛాంపియన్‌గా నిలపాలని పట్టుదలతో ఉన్నాడు. గత సీజన్లలో ఎల్‌ఎస్‌జీ ప్లేఆఫ్స్ వరకు వెళ్లినప్పటికీ ట్రోఫీని గెలవలేకపోయింది. ఈసారి పంత్ రాకతో ఆ లోటు తీరుతుందని ఫ్రాంచైజీ భావిస్తోంది. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్‌లో కూడా పంత్ చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. నెట్స్‌లో ఆయన కొడుతున్న షాట్లు చూసి మెంటార్ జహీర్ ఖాన్, కోచ్ జస్టిన్ లాంగర్ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us