Brad Hogg : రిషభ్ పంత్ ఆట తీరును కొనియాడిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. విరాట్ కెప్టెన్సీపై ప్రశంసల జల్లు..

|

Jan 24, 2021 | 8:17 AM

Brad Hogg Coments: టీమిండియా వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌‌కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ మద్దతుగా నిలుస్తున్నాడు. ఆస్ట్రేలియాతో

Brad Hogg : రిషభ్ పంత్ ఆట తీరును కొనియాడిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. విరాట్ కెప్టెన్సీపై ప్రశంసల జల్లు..
Follow us on

Brad Hogg Coments: టీమిండియా వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌‌కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ మద్దతుగా నిలుస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అతడి ఆటతీరును కొనియాడుతున్నాడు. వెంటనే అతడిని టీ 20లలో ఆడించాలని టీం ఇండియాకు సలహా ఇస్తున్నాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. తన యూట్యూబ్ చానెల్‌లో ఈ వివరాలను వెల్లడించాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్ రెండు వీరోచిత ఇన్నింగ్స్‌లు ఆడాడని, కంగారూల గడ్డపై ఆడిన ఇన్నింగ్స్‌లు అంటే ప్రత్యేకంగా భావించాలని అన్నాడు. పంత్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులోకి తీసుకురావాలని కోరాడు. శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో అతడికి చోటు ఇవ్వాలని లేదా సంజు శాంసన్‌కు బదులుగా ఆడించాలని సలహా ఇచ్చాడు. విరాట్ కోహ్లీ, అజింక్య రహానె కెప్టెన్సీ గురించి బ్రాడ్ హాగ్‌ మాట్లాడాడు. కెప్టెన్‌గా రహానె ఆఖరి మూడు టెస్టుల్లో సత్తాచాటాడని, ఎలాంటి ఆందోళన లేకుండా చాలా ప్రశాంతంగా జట్టును నడిపించాడని పొగిడాడు. అయితే టీమిండియాకు కెప్టెన్‌గా కోహ్లీనే ఉండాలని, అతడు కెప్టెన్‌గా ఉంటే మెరుగ్గా బ్యాటింగ్‌ చేస్తాడని అన్నాడు. అతడిని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పిస్తే టీమ్‌ ఇండియాను నాశనం చేసినట్టు అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

విరాట్ కోహ్లీ కంటే స్టీవ్ స్మిత్ బెటర్.. వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు..