టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరలో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. రిషబ్ 2022 సంవత్సరం ఆఖరులో కారు ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుండి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌తో తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే అవకాశముంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే రిషబ్ పంత్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తన రోల్ మోడల్‌గా భావిస్తాడు. తరచుగా అతనిని కలుస్తుంటాడు. ఇటీవల రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ వేడుకకు హాజరయ్యాడు. ఇప్పుడు ఈ ఎంగేజ్ మెంట్ ప్రోగ్రామ్ నుంచి ఒక ఆసక్తికరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో పంత్ ఎంతో భావోద్వేగంగా కనిపించడం గమనార్హం. ఇదే వీడియోలో ఎంఎస్ ధోని తో పాటు రిషబ్ పంత్ తల్లి కూడా ఉన్నారు. ధోని ముందు రిషబ్ పంత్ చాలా ఉద్వేగానికి లోను కావడం, కన్నీళ్లు పెట్టుకోవడం, తల్లి పంత్‌ను ఓదార్చాడం ఈ వీడియోలో చూడొచ్చు.
కాగా రిషబ్ పంత్ తండ్రి చాలా కాలం క్రితం మరణించారు. అందుకే ఇంటి పెద్దగా దగ్గరుండి మరీ సోదరి ఎంగేజ్‌మెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాడు పంత్. త్వరలోనే తాను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతుంది. అందుకేనేమో పంత్ బాగా ఎమోషనల్ అయ్యాడని తెలుస్తోంది. ప్రస్తుతం పంత్ రీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జట్టులోకి వచ్చేందుకు రిషబ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధించేందుకు బెంగళూరులోని శిక్షణా శిబిరంలో కసరత్తులు చేస్తున్నాడు.
An emotional picture with Pant, his mother & Dhoni during Pant sister’s engagement. pic.twitter.com/RQxMJyHNit
— Johns. (@CricCrazyJohns) February 9, 2024
MS Dhoni congratulating Rishabh pant’s sister for engagement ❤#MSDhoni pic.twitter.com/376Cc2SjhX
— Rickyraj (@Rickyra96117469) January 7, 2024
MS Dhoni enjoying at the wedding of Rishabh pant’s sister .#Dhoni #Thala #INDvsENG pic.twitter.com/RUNiWKBhoF
— Zunx (@Zunx11) January 24, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..