Rishabh Pant: అంపైర్‌తో రిషభ్ పంత్ వాగ్వాదం.. ఢిల్లీ కెప్టెన్‌కు ఫైన్ చేయాలన్న మాజీ క్రికెటర్

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ వ్యవహార తీరు వివాదాస్పదంగా మారింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌తో పంత్ వాగ్వివాదానికి దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం కొన్ని నిమిషాల పాటు కొనసాగింది. 4వ ఓవర్‌లో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో కాసేపు గందరగోళం చోటుచేసుకుంది.

Rishabh Pant: అంపైర్‌తో రిషభ్ పంత్ వాగ్వాదం.. ఢిల్లీ కెప్టెన్‌కు ఫైన్ చేయాలన్న మాజీ క్రికెటర్
Rishabh Pant Vs Umpire Delhi Ipl 2024 (Photo: AFP)

Updated on: Apr 13, 2024 | 1:49 PM

IPL 2024 Updates: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ వ్యవహార తీరు వివాదాస్పదంగా మారింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌తో పంత్ వాగ్వివాదానికి దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం కొన్ని నిమిషాల పాటు కొనసాగింది. 4వ ఓవర్‌లో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో కాసేపు గందరగోళం చోటుచేసుకుంది. ఇషాంత్ శర్మ వేసిన బంతిని దేవదుత్ పడిక్కల్ ఎదుర్కొన్నాడు. బంతిని వైడ్‌ బాల్‌గా ఫీల్డ్ అంపైర్ సిగ్నల్ ఇచ్చాడు. పంత్ దీనిపై రివ్యూ కోసం అడినట్లు టీ సైన్ చూపించాడు. అయితే పంత్ ఆ సమయంలో అంపైర్‌ను చూడలేదు. పంత్ రివ్యూ కోసం అడిగినట్లు భావించిన అంపైర్.. థర్డ్ అంపైర్‌ను రివ్యూ కోసం అడిగారు. థర్డ్ అంపైర్ రివ్యూలో కూడా ఇది వైడ్‌గానే నిర్ధారణ అయ్యింది. అయితే అసలు తాను ఈ వైడ్‌పై రివ్యూ అడగలేదంటూ అంపైర్‌తో పంత్ స్వల్ప వాగ్వివాదానికి దిగాడు. ఈ మ్యాచ్‌లో లక్నో‌పై ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు వరుస ఓటముల తర్వాత ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఢిల్లీ ఫ్యాన్స్ సంబరాలు మిన్నంటాయి.

రిషబ్ పంత్ రివ్యూ అడిగినట్లు భావించిన అంపైర్..

అంపైర్‌తో రిషభ్ పంత్ వాగ్వాదం..వీడియో

దీనిపై ఆసీస్ మాజీ వికెట్ కీపర్, కామెంటేటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ స్పందిస్తూ.. గ్రౌండ్‌లో పంత్ వ్యవహరించిన తీరు సరికాదన్నారు. పంత్-అంపైర్ మధ్య సమాచార లోపం జరిగిందని.. దాని కోసం నాలుగు నిమిషాలు పాటు చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ఆటగాళ్లు ఇలా ప్రవర్తిస్తే జరిమానా విధించాలని అన్నాడు.

అటు సోషల్ మీడియా వేదికగానూ రిషభ్ పంత్‌ను కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రివ్యూ తనకు అనుకూలంగా లేదని అంపైర్‌తో వాగ్వివాదానికి దిగడం కరెక్ట్ కాదంటున్నారు. మరికొందరు మాత్రం పంత్‌కు బాసటగా నిలుస్తున్నారు. పంత్ రివ్యూ అడగలేదని.. సమాచార లోపం కారణంగా ఈ గందరగోళం జరిగిందని చెబుతున్నారు.

ఆ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా పంత్ రికార్డు..

ఇదిలా ఉండగా రిషభ్ పంత్ ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయస్సులో 3000 పరుగుల మైలురాయిని అధిగమించిన మూడో ఆటగాడిగా ఘనత సాధించాడు. 26 ఏళ్ల 191 రోజుల వయస్సులో పంత్ 3 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. శుభమన్ గిల్ 24 ఏళ్ల 214 రోజులు, విరాట్ కోహ్లీ 26 ఏళ్ల 186 రోజులకు 3 వేల పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి తర్వాత పంత్ మూడో స్థానంలో నిలుస్తున్నాడు.