ఓరేయ్ ఆజామూ.. బ్యాగులు సర్దేయ్ రోయ్.. అట్టర్ ఫ్లాప్ తో బాబర్ రిటైర్మెంట్ ప్లాన్? ‘రియల్ ధురంధర్’ అంటూ..

Babar Azam Trolled on Social Media: పాకిస్తాన్ సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజాం దారుణంగా విఫలమయ్యాడు. భారత జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ దారుణంగా వస్తున్నాయి. రిటైర్మెంట్ చేయాలంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఓరేయ్ ఆజామూ.. బ్యాగులు సర్దేయ్ రోయ్.. అట్టర్ ఫ్లాప్ తో బాబర్ రిటైర్మెంట్ ప్లాన్? ‘రియల్ ధురంధర్’ అంటూ..
Babar Azam

Updated on: Feb 16, 2026 | 10:26 AM

Babar Azam Trolled on Social Media: భారీ అంచనాల మధ్య భారత్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లో పాకిస్తాన్ ఛేజింగ్ ను విజయవంతం చేయడంలో మాజీ కెప్టెన్ బాబర్ ఆజం దారుణంగా విఫలమయ్యాడు. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో కీలకమైన మ్యాచ్‌లో అతని ఆట ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సోషల్ మీడియాలో ‘రియల్ ధురంధర్’ అంటూ మీమ్స్ వెల్లువెత్తాయి.

176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజం తొలుత నెమ్మదిగా ఆడుతూ మొమెంటమ్ అందుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. మధ్య ఓవర్లలో వేగం పెంచడంలో విఫలమైన అతను, అక్సర్ పటేల్ బౌలింగ్‌లో తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు.

కీలక సమయంలో వేగంగా పరుగులు చేయలేకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో నెట్‌లో అభిమానులు, ట్రోల్స్ ‘ధురంధర్’ అనే పదాన్ని ఉపయోగిస్తూ బాబర్ ఆటను విమర్శించారు. జట్టు రన్‌రేట్‌ను నెమ్మదింపజేసేలా అతని ఇన్నింగ్స్ ఉందని, ‘యాంటీ-టీమ్’ పాత్రలో ఉన్నట్టుగా ఉందని కొందరు మీమ్స్ ద్వారా ఎద్దేవా చేశారు.

ఈ మ్యాచ్ తర్వాత బాబర్ ఆజం ప్రదర్శనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఒకప్పుడు పాకిస్తాన్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన అతను, కీలక మ్యాచ్‌లో విఫలమవ్వడం అభిమానుల్లో ఆగ్రహానికి దారి తీసింది.

టీ20 ప్రపంచకప్ 2026లో బాబర్ ఆజాం ప్రదర్శన..

2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో ఫిబ్రవరి 16, 2026 నాటికి బాబర్ అజామ్ మూడు ఇన్నింగ్స్‌లలో 66 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్‌పై 15 పరుగులు, ఆ తర్వాత అమెరికాపై 46 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. అయితే, ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగిన మ్యాచ్ లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి, తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

మొత్తం పరుగులు: 3 మ్యాచ్‌లలో 66 పరుగులు చేయగా.. స్ట్రైక్ రేట్ 115.78గా ఉంది. అయితే, ఈ టోర్నమెంట్ సమయంలో, బాబర్ 4,500 కెరీర్ టీ20ఐ పరుగులను చేరుకున్నాడు. ఫార్మాట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

తదుపరి మ్యాచ్: పాకిస్తాన్ ఫిబ్రవరి 18 బుధవారం కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో నమీబియాతో ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..