
Royal Challengers Bengaluru Full Squad, IPL 2026 Auction: డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఐపీఎల్ 2026 మినీ వేలంలో కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసి తమ జట్టును మరింత పటిష్టం చేసుకుంది. అబుదాబి వేదికగా జరిగిన ఈ వేలంలో, ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను రూ. 7 కోట్లకు కొనుగోలు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లతో పోటీపడి మరీ RCB అతన్ని సొంతం చేసుకుంది.
గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న RCB, ఈసారి కూడా టైటిల్ నిలబెట్టుకునే లక్ష్యంతో ఉంది.
వెంకటేష్ అయ్యర్ (రూ. 7 కోట్లు) – స్టార్ ఆల్ రౌండర్
మంగేష్ యాదవ్ (రూ. 5.2 కోట్లు)
జాకబ్ డఫీ (రూ. 2 కోట్లు) – న్యూజిలాండ్ పేసర్
జోర్డాన్ కాక్స్ (రూ. 75 లక్షలు)
సాత్విక్ దెస్వాల్ (రూ. 30 లక్షలు)
విక్కీ ఓస్త్వాల్ (రూ. 30 లక్షలు)
విహాన్ మల్హోత్రా (రూ. 30 లక్షలు)
కనిష్క్ చౌహాన్ (రూ. 30 లక్షలు)
ప్రస్తుత జట్టు, అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు (Current Squad & Retained Players): కెప్టెన్ రజత్ పాటిదార్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు RCB తమ కోర్ టీమ్‌ను అలాగే కొనసాగించింది.
కీలక ఆటగాళ్లు: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్.
బౌలింగ్, ఆల్ రౌండర్లు: భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యష్ దయాల్, నువాన్ తుషార, రసిక్ సలాం, రొమారియో షెపర్డ్, జాకబ్ బెతెల్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ, అభినందన్ సింగ్.
విడుదల చేసిన ఆటగాళ్లు: లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్, లుంగి ఎంగిడి, స్వస్తిక్ చికారా, మనోజ్ భాండగే, మోహిత్ రథీ.
మధ్యప్రదేశ్‌కు చెందిన రజత్ పాటిదార్ సారథ్యంలో, వెంకటేష్ అయ్యర్ వంటి ఆల్ రౌండర్ల చేరికతో RCB సమతుల్యంగా కనిపిస్తోంది. కోహ్లీ, పడిక్కల్, సాల్ట్ వంటి బ్యాటర్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా, భువీ, హాజిల్‌వుడ్ వంటి సీనియర్లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..