ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ వేలం(IPL 2022 Auction)లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బలమైన ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై దృష్టి సారించింది. ఫ్రాంచైజీ దినేష్ కార్తీక్, జోష్ హేజిల్‌వుడ్, ఫాఫ్ డు ప్లెసిస్, హర్షల్ పటేల్‌లను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇది కాకుండా వెస్టిండీస్ ఆల్ రౌండర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌ను కేవలం కోటి రూపాయలకు RCB కొనుగోలు చేసింది. అదే సమయంలో, ఫ్రాంచైజీ చాలా మంది యువ భారతీయ ఆటగాళ్లపై కూడా నమ్మకం చూపింది. ఇందులో ఆకాష్ దీప్, అనుజ్ రావత్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రోర్, అనీశ్వర్ గౌతమ్, చామ వి మిలింద్ ఉన్నారు. చివరికి ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ విల్లీని ఆర్‌సీబీ(Royal Challengers Bangalore) రెండు కోట్లకు కొనుగోలు చేసింది.
RCB ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను జట్టులో చేర్చుకోవడం ద్వారా బౌలింగ్‌ను బలోపేతం చేసింది. న్యూజిలాండ్ తుఫాన్ ఓపెనర్ ఫిన్ అలెన్‌తో బెంచ్ బలాన్ని బలపరిచింది. జట్టు ప్రస్తుతం అనుభవం, యువత కలయికతో ముందుకు రానుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పూర్తి జట్టు-
కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
జోష్ హేజిల్‌వుడ్- రూ. 7.75 కోట్లు
వనిందు హసరంగా- రూ. 10.75 కోట్లు
దినేష్ కార్తీక్- రూ. 5.50 కోట్లు
హర్షల్ పటేల్- రూ. 10.75 కోట్లు
ఫాఫ్ డు ప్లెసిస్- రూ. 7 కోట్లు
ఆకాష్ దీప్- రూ. 20 లక్షలు
అనుజ్ రావత్- రూ. 3.40 కోట్లు
షాబాజ్ అహ్మద్- రూ. 4.40 కోట్లు
మహిపాల్ లోమ్రోర్- రూ. 95 లక్షలు
షర్ఫీన్ రూథర్‌ఫోర్డ్- రూ. 1 కోటి
జాసన్ బెహ్రెన్‌డార్ఫ్- రూ. 75 లక్షలు
ఫిన్ అలెన్- రూ. 80 లక్షలు
సుయాష్ ప్రభుదేశాయ్- రూ. 30 లక్షలు
చామ వి మిలింద్- రూ. 25 లక్షలు
అనిశ్వర్ గౌతమ్- రూ. 20 లక్షలు
నవనీత్ సిసోడియా- రూ. 20 లక్షలు
డేవిడ్ విల్లీ- రూ. 2 కోట్లు
సిద్ధార్థ్ కౌల్- రూ. 75 లక్షలు
లువింత్ సిసోడియా- రూ. 20 లక్షలు
నిలబెట్టుకున్న ఆటగాళ్లు..
విరాట్ కోహ్లీ- రూ. 15 కోట్లు
గ్లెన్ మాక్స్‌వెల్ – రూ. 11 కోట్లు
మహ్మద్ సిరాజ్- రూ. 7 కోట్లు
Ipl 2022 Auction: రూ. 20 లక్షల బేస్ ధరతో మొదలై కోటీశ్వరుడు.. ఈ స్వింగ్ సుల్తాన్ ఎవరో తెలుసా..