Ind vs Eng: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ జడేజా తిరిగి ట్రాక్‌లోకి వచ్చేశాడు

|

Mar 04, 2021 | 9:01 AM

మార్చి 4  నుంచి ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో జరగబోయే నాల్గవ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా అస్త్రశస్తాలతో రెడీ అయిపోయింది.  దీని తరువాత, టీ 20 సిరీస్‌లో జట్టు పాల్గొంటుంది.

Ind vs Eng: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ జడేజా తిరిగి ట్రాక్‌లోకి వచ్చేశాడు
తిరిగి ట్రాక్‌లోకి జడేజా
Follow us on

Ravindra Jadeja: మార్చి 4  నుంచి ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో జరగబోయే నాల్గవ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా అస్త్రశస్తాలతో రెడీ అయిపోయింది.  దీని తరువాత, టీ 20 సిరీస్‌లో జట్టు పాల్గొంటుంది. ఇందులో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ క్రమంలో, పరిమిత ఓవర్ సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు పెద్ద ఉపశమనం లభించింది. టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బొటనవేలు గాయం నుంచి కోలుకొని తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన జడేజా బొటనవేలు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. కోలుకోవడంతో తాజాగా జడ్డూ మైదానంలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో మెల్‌బోర్న్‌లో ఆడిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా గాయపడ్డాడు. ఈ సిరీస్‌లో, బౌలింగ్ పరంగానూ, బ్యాటింగ్ పరంగానూ ఉత్తమ ప్రదర్శన కనబరిచిన జడేజా, గాయం కారణంగా బ్రిస్బేన్‌లో నాల్గవ మ్యాచ్ ఆడలేకపోయాడు. తాజాగా జడేజా ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసి, ఇప్పుడు తాను తిరిగి ఫీల్డ్‌లోకి వచినట్లు రాసుకొచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగే టీ 20 లేదా వన్డే సిరీస్‌లో జడేజా తిరిగి అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది.

 

టి 20 సిరీస్ మార్చి 12 నుంచి ప్రారంభమవుతుంది…

ప్రస్తుతం నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు పందెం కోళ్ళలా తలపడుతున్నాయి. ఈ సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. టెస్ట్ సిరీస్ తరువాత, ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మార్చి 12 నుంచి ప్రారంభమవుతుంది. ఇవన్నీ అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతాయి. దీని తరువాత, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇరు జట్లు తలపడతాయి. వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు పూణేలో జరుగుతాయి. అనంతంరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14 వ సీజన్లో భారత ఆటగాళ్ళు ప్రవేశిస్తారు. ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌లో రవీంద్ర జడేజా సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే.

Also Read:

ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు

Mandala Ramu : కత్తులు, గొడ్డళ్లు, వేటకొడవలు, చాకులతో టీఆర్ఎస్ ఎంపీటీసీపై మర్డర్ అటెంప్ట్