Ravichandran Ashwin
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్యలోనే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ ఆర్ అశ్విన్ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గాబా టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో అశ్విన్ తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టులోకి ఎంపికైన అశ్విన్ రెండో టెస్టు మ్యాచ్ లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. కానీ మూడో టెస్టు మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇక మ్యాచ్ ముగిసిన వెంటనే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. దీంతో అశ్విన్ వీడ్కోలు మ్యాచ్ ఆడలేకపోయాడు. ఇలా అశ్విన్ లాగే ఫేర్ వెల్ మ్యాచ్ ఆడకుండానే తమ కెరీర్‌కు వీడ్కోలు పలికిన భారత క్రికెటర్లు చాలా మంది ఉన్నారు.
- ఎంఎస్ ధోని 2014లో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అశ్విన్ లాగే ఆస్ట్రేలియా పర్యటనలో మూడో మ్యాచ్ తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఆరేళ్ల తర్వాత ఆగస్టు 15న కెప్టెన్ కూల్ వన్డే, టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ధోనీకి కూడా అశ్విన్ లాగా వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు.
- 2017లో వెస్టిండీస్‌తో చివరి వన్డే మ్యాచ్ ఆడిన యువరాజ్ సింగ్‌కు కూడా వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అయితే 2019లో రిటైర్మెంట్ ప్రకటించాడు. తన చివరి వన్డే ఇంటర్నేషనల్ ఆడటానికి ముందు, యువీ భారత జట్టులో పునరాగమనం చేయడానికి దాదాపు రెండు సంవత్సరాలు ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు.
- ఈ జాబితాలో మూడో స్థానంలో రాహుల్ ద్రవిడ్ పేరు ఉంది. ది వాల్ పేరుతో ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన ద్రవిడ్ కు వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. 2012లో ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హఠాత్తుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి రిటైర్మెంట్ ప్రకటించాడు.
- భారత వెటరన్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. 18 ఆగస్టు 2018న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెటరన్ ప్లేయర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు.
- భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌కు కూడా వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. సెహ్వాగ్ తన వీడ్కోలు మ్యాచ్ ఆడాలని చాలా సందర్భాలలో చెప్పినప్పటికీ, బోర్డు అతనికి వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశాన్నిఇవ్వలేదు. సెహ్వాగ్ చివరకు 20 అక్టోబర్ 2015న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..