
భారత క్రికెట్ దిగ్గజం క్రికెటర్‌పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించారు. అలాంటి ఆటగాడు భారత క్రికెట్‌కు మళ్లీ దొరకడం చాలా కష్టమని, అతను జట్టుకు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అతను భారత జట్టుకు ఇన్ని సంవత్సరాలు ఆడటం దేశ క్రికెట్‌కు దక్కిన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు అని అనుకుంటున్నారా? ఇంకెవరు కింగ్ విరాట్ కోహ్లీ.
రవిశాస్త్రి మాట్లాడుతూ.. “ఇన్ని సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌కు లభించడం అదృష్టమని, అతని లేకపోవడం అతని గొప్పతనాన్ని మరింతగా చాటిచెబుతుందని తాను నమ్ముతున్నానని, అతనిలాంటి ఆటగాడు భారత క్రికెట్‌కు మరెన్నడూ దొరకడని రవిశాస్త్రి అన్నారు.” అని అన్నారు. అలాగే ఒక వ్యక్తి విలువ అతను ఉన్నప్పుడు కంటే, అతను లేకపోయిన తర్వాతే ఎక్కువగా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. కోహ్లీ కూడా అలాంటి ఆటగాడేనని, అతను జట్టులో లేకపోవడం ద్వారా అతని గొప్పతనం ఎంతటిదో అభిమానులు, క్రికెట్ ప్రపంచం మరింతగా గుర్తిస్తాయని చెప్పారు.
టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో కోహ్లీ సాధించిన పరుగులు, ఎన్నో చారిత్రాత్మక విజయాల్లో పోషించిన పాత్ర, భారత జట్టును ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్టుగా నిలబెట్టడంలో అతని కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయని రవిశాస్త్రి కొనియాడారు. కోహ్లీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు రవిశాస్త్రి భారత జట్టు హెడ్ కోచ్‌గా పనిచేశారు. ఈ ఇద్దరి కలయికలో భారత్ విదేశాల్లో చారిత్రాత్మక టెస్టు విజయాలు నమోదు చేయడంతో పాటు, ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. అందుకే కోహ్లీ సామర్థ్యం, నాయకత్వం గురించి రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. రవిశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి